త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Civil Supplies Department | తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. స్ప‌ష్టం చేసిన పౌర సరఫరాల శాఖ

Civil Supplies Department | తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరుతూ, రాష్ట్రంలో ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపింది.

P

Telangana | Published On Apr 27, 2026, 9.05 pm IST

Civil Supplies Department | తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. స్ప‌ష్టం చేసిన పౌర సరఫరాల శాఖ
Advertisement

Civil Supplies Department | తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఇంధనం దొరకదని వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని, ప్రజలు వాటిని నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయాణికులు, రవాణా రంగం, రైతులకు అవసరమైనంత ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీలతో కలిసి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,081 కిలోలీటర్ల డీజిల్ సరఫరా అవుతుండగా, మొత్తం 18,524 కిలోలీటర్ల ఇంధనం నిరంతరంగా అందుబాటులో ఉందని పేర్కొంది. ఇంధనం అందరికీ సకాలంలో చేరేందుకు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, అనవసరంగా భయపడి పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీయొద్ద‌ని విజ్ఞప్తి చేసింది. ప్రమాదాలకు దారితీసేలా ఇళ్లలో అక్రమంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని హెచ్చరించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు ఓపికతో వ్యవహరించాలని, పెట్రోల్ బంక్ సిబ్బంది, స్థానిక పోలీసులకు సహకరించాలని సూచించింది. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిస్థితులను పౌర సరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కావాలనే కొరత సృష్టించినా, ఇంధనాన్ని దాచిపెట్టినా, పుకార్లు వ్యాప్తి చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంధన సరఫరా సంబంధిత ఫిర్యాదులు లేదా అక్రమ నిల్వలపై సమాచారం ఉన్నవారు వెంటనే పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1967ను సంప్రదించాలని అధికారులు కోరారు.

Advertisement
Advertisement