త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలింది

కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునే అవకాశం ఉన్నా ఏనాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారన్నారు.

J

Hyderabad | Published On Dec 22, 2025, 5.52 pm IST

Jupally Krishna Rao | బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలింది
Advertisement

Jupally Krishna Rao | అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉన్న ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూస్తేనే బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోందన్నారు. ఆ పార్టీ ప్రతిష్ట దిగజారిందని, కేటీఆర్, హరీశ్ రావులు ఆ పార్టీని కాపాడుకోలేకపోయారన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన జూపల్లి బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

బలహీనమైన , రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ ను వదిలి బయటకు వచ్చారు తప్ప, పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు,గాడిద గుడ్డు కాదు అంటూ హేళన చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్ట్ లను గత కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. కాలువలు పూర్తికాకుండానే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. కానీ ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. 10 ఏండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. పదేండ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేని మీకు ఉన్నట్టుండి ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు.

అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి ఏనాడు తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడలేదు. సఖ్యత ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో అంటకాగి రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తామని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు.

Jupally Krishna Rao |కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకుంది మీరు కాదా?

కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునే అవకాశం ఉన్నా ఏనాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడం లేదన్నారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతోందన్నారు. తెలంగాణ వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేదు. డిమాండ్ కు అనుగుణంగా యూరియా కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement