NEET UG | రేపు నీట్ యూజీ.. మధ్యాహ్నం 1.30 తర్వాత నో ఎంట్రీ..
NEET UG | ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) ఆదివారం (మే 3) జరుగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది.
NEET UG | త్రినేత్ర.న్యూస్: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) ఆదివారం (మే 3) జరుగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సూచించింది. మధ్యాహ్నం 1.30 తర్వాత ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి లేదని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువుల వివరాలను ఎన్‌టీఏ ఇప్పటికే విడుదల చేసింది.
కాగా, రాష్ట్రంలో సుమారు 73,084 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. హైదరాబాద్ నుంచి 28,697 మంది విద్యార్థులు నీట్‌కు హాజరు కానున్నారు. వీరికోసం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర 24 పట్టణాల్లో 199 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక హైదరాబాద్‌లోనే 69 పరీక్ష కేంద్రాలున్నాయి.
పరీక్ష ప్రారంభానికి మూడు గంటల ముందే పరీక్షా కేంద్రం గేట్లు తెరుస్తారు. అభ్యర్థుల గుర్తింపునకు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్, వీడియోగ్రఫీ వంటి చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు ఎన్‌టీఏ సూచించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






