KTR | రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుంది..: కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి ప్రసంగంలో సరుకు, సబ్జెక్టు లేదు. గ్యారంటీల ప్రస్తావన లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ప్రసంగం వాడుకున్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారు. క్యూర్, ప్యూర్, రేర్ అని కొత్త మాటలు ఎత్తుకున్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్: ఇది బడ్జెట్ సెషనో లేక కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషనో అర్ధం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చుడు వచ్చుడే మోతీలాల్ గోతీలాల్ నెహ్రూ అంటూ, బలిదేవత గురించి అంటూ, ఆ తర్వాత ఆమె కొడుకు ముద్దపప్పు గురించి అంటూ మొత్తం హిస్టరీ చెపుతున్నాడని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. `రేవంత్ రెడ్డి ప్రసంగంలో సరుకు, సబ్జెక్టు లేదు. గ్యారంటీల ప్రస్తావన లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ప్రసంగం వాడుకున్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారు. క్యూర్, ప్యూర్, రేర్ అని కొత్త మాటలు ఎత్తుకున్నారు. 420 హామీలు ఇచ్చిన చోర్ దేశంలో ఎక్కడా లేరు.
ఆరు గ్యారెంటీల హామీ ఫైల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో కాలిపోయిందేమో అనుకున్నాం. కానీ ఓటుకు నోటు దొంగ ఎత్తుకు పోయారు. మానసికస్థితి సరిగా లేని వ్యక్తిని ఇంకా రెండున్నర ఏళ్లు తెలంగాణ ప్రజలు భరించాలి. మా మీద భూతులు వరద తప్ప ప్రసంగంలో ఏం లేదు. రైతు బంధు ఎవరి ఖాతాలో వేశారు? రాహుల్ గాంధీ ఖాతాలో వేశారా?. రూ.16 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు ఎందుకు?.
నిరుద్యోగులకు మోసం
11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. అశోక్ నగర్ వస్తే బట్టలతో మీరు వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగుల పీఆర్సీ ప్రస్తావన లేదు. గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నారు. గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారు. సభ రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. రౌడీ దర్బార్ అనే స్థాయిలో మాట్లాడుతున్నారు.
వారిని తొక్కి వచ్చారు..
శ్రీధర్ బాబు, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ లాంటి వారిని తొక్కి వచ్చారు. వీధి రౌడీల మాట్లాడిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. స్పీకర్‌కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముఖ్యంత్రి మాటలు రికార్డుల నుంచి తొలగించాలి. ఇది బడ్జెట్ సెషనా, లేక కాంగ్రెస్ డబ్బానా అర్ధం కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చుడు వచ్చుడే మోతీలాల్ గోతీలాల్ నెహ్రూ అంటూ, బలిదేవత గురించి అంటూ, ఆ తర్వాత ఆమె కొడుకు ముద్దపప్పు గురించి అంటూ మొత్తం హిస్టరీ చెపుతున్నాడు.
భూములపైనే రేవంత్ కన్ను..
మహాలక్ష్మీకి మంగళం పాడారు. రైతన్నలకు రూ.28 వేల కోట్లు బాకీ ఉన్నారు. ఐఐటీ, ఐఐఐటీకి తేడా తెలువని సన్నాసి ముఖ్యమంత్రి అయ్యారు. కేరళం ఎన్నికల నిధుల కోసం ప్రణాళికకు తెరలేపారు. పేదల ఇండ్లు కూల్చారు తప్ప, ఒక్క ఇటుకపెట్టి ఒక్క ఇళ్లూ కట్టలేదు. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుంది.
మేము మిషన్ కాకతీయలో 30 వేల చెరువులు అభివృద్ధి చేశాం. మీరు మూడు చెరువులు అభివృద్ధి చేసి డబ్బా కొట్టుకుంటున్నారు. కేసీఆర్ చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లు అని కేంద్రం చెపితే, రూ.8 లక్షల కోట్లు అని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రేవంత్ రెడ్డి రెండేండ్లలో చేశారు. ఈ డబ్బులు అన్ని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. రేవంత్ రెడ్డి దోపిడీని కచ్చితంగా అడ్డుకుంటాం. మీరు సంస్కారంతో మాట్లాడితే మేము సంస్కారంగా మాట్లాడుతాం.
అనుముల దండుపాళ్యం ముఠా..
ఆరు గ్యారెంటీల అంశం బడ్జెట్‌లో లేకపోతే ఎండగడుతాం. అనుముల దండుపాళ్యం ముఠా దోపిడిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకో రేవంత్ రెడ్డి. కేసీఆర్ గురించి మాట్లాడే అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకో.. నీలాగా చిల్లరగా చిలకొట్టుడు కొట్టి బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. ఈ గజ దొంగను నిరోధిస్తాం. ప్రజల తరపున కోట్లాడుతాం.
రేవంత్ రెడ్డి అనే పిచ్చోడు కొడంగల్‌లో ఓడిపోలేదా?. 2029లో అధికారంలోకి రావడం కాదు. ఇంకో రెండేండ్లు తెలంగాణ ప్రజలు నిన్ను భరించడమే ఎక్కువ. మూసి మీద ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు?. కాలం మనది కానప్పుడు తీన్ ఫుట్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా మాట్లాడుతాడు. ఆయన అధికారంలో ఉన్నాడు మైక్ కట్ కాదు కాబట్టి ఏదైనా వాగుతాడు` అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



