CM Revanth Reddy | జిల్లాలు మారవ్.. ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులు మారవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2027 వరకు ఎలాంటి ప్రక్రియ జరుగదని, కేంద్రం ఆదేశాలు ఉన్నాయని వెల్లడించారు. పిప్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
CM Revanth Reddy | గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులు మారవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2027 వరకు ఎలాంటి ప్రక్రియ జరుగదని, కేంద్రం ఆదేశాలు ఉన్నాయని వెల్లడించారు. పిప్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆడబిడ్డలు ఇక్కడున్నరు. మీ ఇండ్లలో కరెంటు ఉంది. మీ కళ్లలో ఆనందం కనబడుతుంది. 200 యూనిట్లు 50లక్షల కుటుంబాలకు అందుతుందా లేదా ఆలోచన చేయాలి. ఆనాడు గొప్పగొప్ప మాటలు చెప్పారు. ఉచిత కరెంటే కాదు.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తమన్నరు. కొడుకు కోడలు ఉంటే.. ఏడ ఉంటరు.. బిడ్డ అల్లుడు వస్తే పండుగకు ఏడ పండుకంటరు.. కోడిపిల్ల, మేకపిల్ల ఉంటే ఎక్కడ కట్టేస్తరు అన్నరు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు రాలేదు. అహనాపెళ్లంట సినిమాలో కోడిని వేలాది వట్టి అన్నం తిన్నట్లుగా నడిచింది. మన ప్రభుత్వం వచ్చాక ఇవాళ 4.50లక్షల ఇండ్లు రూ.22,500కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇనాడు మంజూరు చేశాం. ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో మరో 25వేల అదనపు ఇండ్లు పేదలు కట్టుకోవాలి, అడవిబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.5లక్షలు ఖాతాల్లో పడేలా చేశాం' అని ప్రకటించారు.
రూ.5400కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో..
'ఈ వేదిక నుంచి ప్రతిపక్షానికి చెప్పదలచుకున్న ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.5400కోట్లు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో నగదు వేశామని ధైర్యంగా, గుండెధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక నుంచి చెప్పదలచుకున్న. ఎన్నడైనా పేదోడు ఆత్మగౌరవంతో బతకాలి, సొంత ఇళ్లు ఉండాలని ఆలోచన చేశారా? రూ.500కే సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? ఆనాడు అన్న నందమూరి తారకరామారావు రూ.2కే కిలో బియ్యం పథకం తీసుకువచ్చారు. 40 సంవత్సరాలు అయ్యింది.. ఇంకా గదే దొడ్డు బియ్యం తినాలంటే.. ఈనాడు కాలం మారింది. పంట మారింది. చదువులు మారాయ్. విజ్ఞానం పెరిగింది. ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు. పశువులకు దానాగా పెట్టే పరిస్థితి వచ్చింది' అని పేర్కొన్నారు.
ఈ ఆలోచన మీకు వచ్చిందా?
'సన్నబియ్యంతో పేదవాడి కడుపునింపాలన్న ఆలోచన వచ్చిందా? ఈనాడు ధైర్యంగా ఈ వేదిక నుంచి చెప్పదలచుకున్నా. 3.17కోట్ల బిడ్డలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం పేదలకు అందిస్తున్నాం. మా అక్కలు వంట వంటి ఇంటాయనకే కాదు సంటి పిల్లలకు వంటి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ రేషన్ షాపుల్లో లైన్లలో నిలబడి సన్న బియ్యం తీసుకొని ఇంటికి పోతున్నరు. దొడ్డుబియ్యం ఇస్తే రేషన్ షాపోడే కిలోకు రూ.10 నగదు ఇస్తే ఇచ్చినట్టు. మిల్లర్ల మాఫియా, దళారుల మాఫియా బియ్యం పథకానికి తూట్లు పొడిచింది. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు.. వెయ్యి ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశాం. సోలార్ అదానీ, అంబానీలు కాదు.. మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్లు ఇచ్చాం. హైటెక్ సిటీ స్థలాన్ని ఇచ్చి.. మా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను అమ్మేలా అంతర్జాతీయ మార్కెట్ వసతి కల్పించాం' అని వెల్లడించారు.
సరిహద్దులు మార్చొద్దని కేంద్రం ఆదేశాలు..
'మండలాలు, రెవ్యెన్యూ డివిజన్లు, గ్రామాల సరిహద్దులు మార్చొద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చేందుకు అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసి.. ఆ తర్వాత బోథ్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలన్న సమస్యను పరిష్కరించుకుందాం. ఆనాడు ప్రాణహిత-చేవెళ్ల తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టి.. కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది. ఊరు మారింది. అంచనాలు మారాయి. రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లయ్యింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. మూడేళ్లలోనే కట్టుడు కూలిపోవుడు జరిగిపోయింది' అని వ్యాఖ్యానించారు.
ఆదిలాబాద్‌కు నీళ్లు తెస్తాం..
'మా ఆదిలాబాద్‌కు నీళ్లు రాలేదు. మా ప్రేమ్‌సాగర్‌రావు ఎప్పుడూ అంటారు.. గోదావరి తలాపు నుంచే పోతుంది.. నీరు రాలేదని అంటారు. అందుకే ఈ వేదిక నుంచి మాట ఇస్తున్నాను. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులే కాదు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి.. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఆ బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్ సర్వేలు చేయిస్తున్నరు. అంచనాలు సిద్ధం చేస్తున్నరు. త్వరలోనే ప్రాణహిత-చేవెళ్ల తుమ్మడిహట్టి వద్ద ప్రారంభించి ఆదిలాబాద్ ప్రాంతానికి నీరందంచి తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించేందుకు మళ్లీ ఇక్కడకు వస్తానని' హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



