త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramchander Rao | కాంగ్రెస్ గెలిస్తే పన్నుల బాదుడే : నిర్మల్ రోడ్‌షోలో ఎన్.రామచందర్ రావు ఫైర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హెచ్చరించారు. నిర్మల్‌లో జరిగిన భారీ రోడ్‌షోలో ఆయన పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎండగట్టారు.

J

Telangana | Published On Feb 9, 2026, 6.41 pm IST

N Ramchander Rao | కాంగ్రెస్ గెలిస్తే పన్నుల బాదుడే : నిర్మల్ రోడ్‌షోలో ఎన్.రామచందర్ రావు ఫైర్
Advertisement

N Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని హోరెత్తించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నిర్మల్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్యతో కలిసి భారీ రోడ్‌షో, బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రెస్ వస్తే 'టాక్స్ టెర్రరిజం'

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. నిర్మల్ వాతావరణం చూస్తుంటే బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నిజాయితీ గల పాలన కోసం బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రచార చివరి రోజున ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచందర్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే తెలుసని విమర్శించారు. "కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీల్లో 'టాక్స్ టెర్రరిజం' (పన్నుల ఉగ్రవాదం) మొదలవుతుంది. స్థానిక పన్నులు, చార్జీలను భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తారు. ప్రజలు వారి మోసపూరిత రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని పిలుపునిచ్చారు. బీజేపీ మాత్రమే 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' నినాదంతో అందరి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

12 ఏళ్లుగా మోసమే..

గత 12 ఏళ్లుగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణను అంధకారంలోకి నెట్టాయని రామచందర్ రావు మండిపడ్డారు. "ఈ రెండు పార్టీలు హామీలు ఇవ్వడం, వాటిని తుంగలో తొక్కడం పరిపాటిగా మార్చుకున్నాయి. ఈ ద్రోహపూరిత రాజకీయాలను ప్రజలు గమనించారు. ఇక వారి ఆటలు సాగవు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టి, నిజాయితీ గల పాలనకు నాంది పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఓటు బీఆర్ఎస్‌కేసినా, కాంగ్రెస్‌కేసినా.. ఎంఐఎంకి వేసినట్లే

ఆతర్వాత ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సభలో మాట్లాడిన రామచందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటేసినా అది ఎంఐఎం పార్టీకి వేసినట్లే అని ఎద్దేవా చేశారు. "నాకు విశ్వాసం ఉంది. 13వ తారీఖు తర్వాత నిజామాబాద్ ఇందూర్ అవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీతో కాపురం చేసిన మజ్లీస్‌తో ఇప్పుడు కాంగ్రెస్ కాపురం చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉండాలి కదా. బీజేపీని ఓడించాలని ఆ రెండు పార్టీల మధ్య బ్రోకరిజం చేస్తోంది మజ్లీస్. తెలంగాణలో మరోసారి నిజాం పాలన తీసుకొచ్చేందుకు మజ్లీస్ ప్రయత్నిస్తోంది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని రేవంత్ అంటున్నారు. 8 మంది ముస్లింలను కార్పొరేషన్లకు చైర్మన్లను చేసిన అని రేవంత్ అంటున్నారు. ఎంత మంది బీసీలను మినిస్టర్లను చేశావు. కామారెడ్డి డిక్లరేషన్ మరిచిపోయావు. చేవెళ్ల డిక్లరేషన్, వరంగల్ యువ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ మరిచి నువ్వు మాత్రం ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని నువ్వు డిక్లేర్ చేస్తావు అంటూ రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

https://x.com/N_RamchanderRao/status/2020794016531616065

 

Advertisement
Advertisement