NIMS | నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకు ఉచితంగా సీక్వెన్సింగ్ జన్యు పరీక్షలు
NIMS | ప్రాణాంతక క్యాన్సర్ (Cancer) మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్నది. దీని బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. వ్యాధి చికిత్సకు కూడా లక్షల్లో ఖర్చు అవుతుండటంతో పేదలు వేద్యానికి వెనకడుగు వేస్తున్నారు.
NIMS | త్రినేత్ర.న్యూస్: ప్రాణాంతక క్యాన్సర్ (Cancer) మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్నది. దీని బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. వ్యాధి చికిత్సకు కూడా లక్షల్లో ఖర్చు అవుతుండటంతో పేదలు వేద్యానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో క్యాన్సర్ రోగులకు నిమ్స్ (NIMS) దవాఖాన గుడ్‌న్యూస్ అందించింది. అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ జన్యు పరీక్షలను (Next Generation Sequencing Genetic tests) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రైవేటులో రూ.80 వేల వరకు అయ్యే ఈ పరీక్షను ఆరోగ్యశ్రీ (Aarogyasri)కింద పేదలకు ఉచితంగా చేయనుంది. తద్వారా క్యాన్సర్‌కు కారణమైన జన్యువును గుర్తించి టార్గెటెడ్ థెరపీ అందించనున్నారు.
మహిళలే అధికం..
రాష్ట్రంలో క్యాన్సర్ బారినపడుతున్న వారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఐదున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 294 మంది క్యాన్సర్ బారిన పడగా, అందులో ఏకంగా 60 శాతం మంది మహిళలే ఉన్నారు. అంటే సుమారు 60 వేల మంది ఆడబిడ్డలు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితమని అనుకునేవారు. కానీ ఈ రిపోర్టు ప్రకారం 33 ఏండ్ల వయస్సు నుంచే మహిళలపై ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి పంజా విసురుతున్నది.
ప్రతి లక్ష మంది జనాభాలో సగటున 62 మంది మహిళలు మహమ్మారి బారిన పడుతుండగా, పురుషుల్లో ఆ సంఖ్య 42కు పరిమితమైంది. మహిళల ప్రాణాలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్లు యమపాశాల్లా మారాయి.
ఆరోగ్య శ్రీ లెక్కల ప్రకారం..
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 15,502 కాగా, గర్భాశయ క్యాన్సర్ కేసులు 11,834గా నమోదయ్యాయి. అండాశయ క్యాన్సర్ కేసులు 5,700గా రికార్డయ్యాయి. ఈ మూడు రకాల క్యాన్సర్లే మహిళా బాధితుల్లో సింహభాగం ఉంటున్నాయి. వీరికి పాలియేటివ్ కేర్, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల అవసరం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి సగటున 18,235 కేసులు నమోదవుతుండగా, అందులో సుమారు 11 వేల కేసులు మహిళలవే ఉంటున్నాయి.
సంబంధిత వార్తలు

BJP Ramchandar Rao | మోదీ పర్యటనతో తెలంగాణ ప్రగతి తథ్యం: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
మే 2, 2026

REDMOD | వైద్య నిపుణులకు సైతం సాధ్యం కాలేదు.. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తున్న ఏఐ..
మే 2, 2026

Dragon Fruit Farming | డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న క్యాన్సర్ పేషెంట్
మే 1, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



