త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Ramchandar Rao | మోదీ ప‌ర్య‌ట‌న‌తో తెలంగాణ ప్ర‌గ‌తి త‌థ్యం: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

BJP Ramchandar Rao | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 10న హైదరాబాద్‌(Hyderabad)కు వ‌స్తున్నారని, ఈ ప‌ర్య‌ట‌న‌తో తెలంగాణ ప్ర‌గ‌తి త‌థ్య‌మ‌ని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు అన్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధి కోసం సుమారు రూ.8,000 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్న‌ట్లు తెలిపారు.

S

News | Published On May 2, 2026, 3.36 pm IST

BJP Ramchandar Rao | మోదీ ప‌ర్య‌ట‌న‌తో తెలంగాణ ప్ర‌గ‌తి త‌థ్యం: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు
Advertisement
  • ఈనెల 10న‌ రూ.8000 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు
  • నిమ్స్‌, జ‌హీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, వ‌రంగ‌ల్ పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ వంటి కీల‌క ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్స‌వం
  • రాష్ట్రంలో ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాలి
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాలే
  • మెద‌క్ జిల్లా మీడియా స‌మావేశంలో బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

BJP Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 10న హైదరాబాద్‌(Hyderabad)కు వ‌స్తున్నారని, ఈ ప‌ర్య‌ట‌న‌తో తెలంగాణ ప్ర‌గ‌తి త‌థ్య‌మ‌ని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు అన్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధి కోసం సుమారు రూ.8,000 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్న‌ట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన మీడియా స‌మావేశంలో శ‌నివారం ఆయ‌న మాట్లాడారు. మోదీ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇవీ ప్రాజెక్టులు..

జహీరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ సిటీ, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిమ్స్ (NIMS) అభివృద్ధి, హఫీజ్‌పేట్, జోగులాంబ గద్వాల్‌లోని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్ట్ వంటి మరిన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా అమలులోకి రానున్నాయి.

హైకోర్టు జోక్యంతో కొంత క‌ద‌లిక..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 1వ తేదీన‌ జీతాలు అందకపోవడం, ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యమవడం, 2015 నుండి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యమవడం వంటి సమస్యలున్నాయి. హైకోర్టు నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది అని చెప్పారు.

హామీల కోసం ప్ర‌జ‌ల ఎదురుచూపు..

ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలి. గత ప్రభుత్వం ఈ హామీని మ‌రిచింది. ప్రస్తుత ప్రభుత్వం అలా చేయొద్దు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ప్రజలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది..

రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. స్వయంగా పలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించాను. అక్కడ వరి ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉండటం, వర్షాల కారణంగా పంట నష్టపోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. సరైన సమయంలో లారీలు, ట్రక్కులు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యమవుతోంది. కొన్నిచోట్ల రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు, కొందరు అధికారులు కుమ్మక్క‌వుతున్నారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితి ఉండ‌డం అన్యాయం. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలి అని రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు.

వరి రైతులే కాకుండా మొక్కజొన్న రైతులూ తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకారం వారి పంట‌ల‌ను కొనుగోలు చేయాలి. రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement