Telangana | ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
Telangana | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల( Govt Employees ) సంక్షేమం విషయంలో సీఎం రేవంత్( CM Revanth ) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం( New health Scheme ) తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల( Govt Employees ) సంక్షేమం విషయంలో సీఎం రేవంత్( CM Revanth ) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం( New health Scheme ) తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త పథకం అమలుపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు ఆరోగ్య శ్రీ( Arogyasri ) ట్రస్టు సీఈవో, ఇతర ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. పాత పథకంలో ఉన్న పలు లోపాలను సవరించి కొత్త ఆరోగ్య పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం
ఈ కొత్త పథకాన్ని ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం’గా వ్యవహరించనున్నారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు కానుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అందించారు. ఈ సేవలు నామమాత్రంగానే ఉన్నాయి. బకాయిలు సరిగా చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కార్డులు కొన్నిచోట్ల చెల్లుబాటు కావడం లేదు. మొదట నగదు చెల్లించి, క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ మొత్తం నగదు తిరిగి రావడం లేదు. దీంతో ఉద్యోగులు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బేసిక్ నుంచి ఒకటిన్నర శాతం నగదు బదిలీ..
కొత్తగా అమలయ్యే పథకంలో ఉద్యోగుల బేసిక్ నుంచి ఒకటిన్నర శాతం నగదు భాగస్వామ్యంతో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగికి రూ.50 వేల బేసిక్ ఉంటే నెలకు రూ.750 వరకు కొత్త పథకంలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. గురువారం జరిగే సమావేశంలో ఈ పథకంపై పూర్తి స్పష్టత రానుంది. తొలుత ఈ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయాలనుకున్నా తర్వాత ట్రస్టు విధానంలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలోనే ఇది కొనసాగనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



