New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
New EHS | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకంను అమలు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
- నెలకు రూ. 88 కోట్ల నిధులు ఖర్చు
- ఈ పథకం కింద 17 లక్షల లబ్ధిదారులు
- మండలిలో మంత్రి దామోదర వెల్లడి
New EHS | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకంను అమలు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ అంశంపై గురువారం శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
2026 జూలై 17 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని మంత్రి తెలిపారు. చీఫ్ సెక్రటరీ
అధ్యక్షతన నూతన ఈహెచ్ఎస్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేశామని చెప్పారు. 30 మంది సభ్యులతో ఉన్న ఈ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి 10 మంది, పెన్షనర్ సంఘాల నుంచి 3 మంది, ప్రభుత్వం నుంచి 16 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.
ఈ పథకానికి ఏడాదికి రూ. 1,056 కోట్ల బడ్జెట్
ఉద్యోగులు, పెన్షనర్లు తమ బేసిక్ పే/చివరిగా పొందిన పెన్షన్‌లో 1.5 శాతం చొప్పున నెలకు చెల్లిస్తుండగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా ఇస్తోందని మంత్రి తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెలకు రూ.44 కోట్లు, ప్రభుత్వం నుంచి మరో రూ.44 కోట్లు కలిపి నెలకు రూ.88 కోట్లు సమకూరుతున్నాయని చెప్పారు. ఈ పథకానికి ఏడాదికి రూ.1,056 కోట్ల బడ్జెట్ ఉందని తెలిపారు.
807 ప్రయివేటు ఆస్పత్రుల్లో అమలు
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 921 ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 114 ప్రభుత్వ, 807 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు.
37 వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు
ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఓపీ వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందించేందుకు ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.
మరో 25 వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో 21 జిల్లాల్లో, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరిలో అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరో 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో మొత్తం వెల్‌నెస్ కేంద్రాల సంఖ్య 37కు చేరుతుందని చెప్పారు.
ఇప్పటివరకు 8,511 కేసులకు రూ.55.14 కోట్లు
పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 8,511 కేసులకు రూ.55.14 కోట్ల ప్రీ-ఆథరైజేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు.
17 లక్షలకు పైగా లబ్ధిదారులు
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలో 17 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి డిజిటల్ ఆరోగ్య కార్డులను వెబ్ పోర్టల్ ద్వారా జారీ చేస్తున్నామని చెప్పారు.
ఓటీపీ ద్వారా స్వయంగా హెల్త్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని, ఉద్యోగులు కోరుకున్న విధంగా ఆరోగ్య సేవలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
సెప్టెంబర్ 10, 2026

MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్‌కు లేదు..
సెప్టెంబర్ 8, 2026

Legislative Council | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్



