త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | సినిమాలు మానేయాల‌నుకున్నా – విడాకుల త‌ర్వాత జీవితంపై స‌మంత కామెంట్స్‌

భ‌ర్త రాజ్ నిడిమోరుపై స‌మంత ప్ర‌శంస‌లు కురిపించింది. వ్య‌క్తిగ‌త జీవితంలోని ఒడిదుడుకుల కార‌ణంగా సినిమాల‌ను మానేయాల‌ని అనుకున్న‌ట్లు చెప్పింది. భ‌ర్త రాజ్ వ‌ల్లే క‌మ్‌బ్యాక్ ఇచ్చాన‌ని అన్న‌ది. స‌మంత కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Sep 10, 2026, 3.54 pm IST

Samantha | సినిమాలు మానేయాల‌నుకున్నా – విడాకుల త‌ర్వాత జీవితంపై స‌మంత కామెంట్స్‌
Advertisement

Samantha | మా ఇంటి బంగారం మూవీతో హీరోయిన్‌గా పెద్ద విజ‌యాన్ని అందుకుంది స‌మంత‌. జూన్ నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. టాలీవుడ్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఈ స‌క్సెస్ జోష్‌లో తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు మ‌రో గుడ్‌న్యూస్‌ను అభిమానుల‌తో పంచుతుంది. ప్రెగ్నెన్సీ కార‌ణంగా సినిమాల‌కు బ్రేక్ తీసుకున్న స‌మంత మా ఇంటి బంగారం ముందు త‌న కెరీర్‌లో ఎదురైన క‌ష్టాల‌పై ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. తాను సినిమాలు మానేయాల‌ని అనుకున్నాన‌ని కానీ భ‌ర్త రాజ్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే మా ఇంటి బంగారంలో న‌టించాన‌ని చెప్పింది.

నా కోసం ఎదురుచూసేవాళ్లు...

"విడాకుల కార‌ణంగా వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకుల్లో ఉన్న టైమ్‌లోనే మ‌యో సైటిస్ బారిన ప‌డ్డా. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డా. ఆ టైమ్‌లో సిటాడెట్ వెబ్‌సిరీస్‌తో పాటు మ‌రో తెలుగు మూవీ అంగీక‌రించాం. సెట్స్‌లో అంద‌రూ మేక‌ప్ వేసుకొని నా కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లు. అంతా ఒకే అనుకునే టైమ్‌లోనే స‌డెన్‌గా హెల్త్ డిస్ట్ర‌బ్ అయ్యి షూటింగ్‌లు ఆగిపోయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. పైకి చెప్ప‌లేక‌పోయినా నా వ‌ల్లే టైమ్ వేస్ట్ అనే భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపించేది. దాంతో నా వ‌ల్ల మ‌రొక‌రు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌వ‌ని సినిమాలు మానేయాల‌ని ఫిక్స‌య్యా. అదే విష‌యం చెబుతూ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన చాలా స్క్రిప్ట్‌లు రిజెక్ట్ చేశా. ప్రొడ్యూస‌ర్‌గా సినిమాలు చేస్తూ తెర‌వెనుకే ఉండిపోవాల‌నుకున్నా" అని స‌మంత అన్న‌ది.

అప‌న‌మ్మ‌కం...

"ఆ టైమ్‌లోనే రాజ్ నా లైఫ్‌లోకి వ‌చ్చాడు. నేను చేయ‌గ‌ల‌నో లేదో అనే అప‌న‌మ్మ‌కంతోనే మా ఇంటి బంగారం సినిమాను అంగీక‌రించా. కానీ రాజ్ మాత్రం న‌న్ను పూర్తిగా నా న‌మ్మాడు. నాలో ధైర్యాన్ని, ఆత్మ‌విశ్వాసాన్ని నింపాడు. క‌ష్ట‌కాలంలో అత‌డు ఇచ్చిన మోర‌ల్ స‌పోర్ట్ న‌న్ను మ‌రింత స్ట్రాంగ్‌గా మార్చింది" అంటూ భ‌ర్త‌పై స‌మంత ప్ర‌శంస‌లు కురిపించింది. ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతోంది. 2021లో నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన స‌మంత...2025లో రాజ్ నిడిమోరును పెళ్లిచేసుకుంది.

 

 

Advertisement
Advertisement