త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy | న‌ల్గొండ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం : మంత్రి కోమ‌టిరెడ్డి

Komatireddy | నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పారు. జాతీయ‌ర‌హ‌దారి 65ను రూ.10,410 కోట్లతో 8 వరుసల రహదారిగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ వద్ద 500 ఎకరాల్లో ట్రాన్స్‌పోర్ట్ హబ్ ఏర్పాటు చేసి బుల్లెట్ రైలు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

P

Telangana | Published On Apr 28, 2026, 7.10 pm IST

Komatireddy | న‌ల్గొండ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Komatireddy | నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంత్రి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లా రూపురేఖలు మార్చేలా రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

ప్ర‌తి గ్రామానికి అభివృద్ధి ఫ‌లాలు..

ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచి నల్గొండను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ మధు అకాల మరణంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో 12–13 సంవత్సరాలు స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేసిన మధు, ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’ పత్రికల్లో సేవలందించారని, డిప్యూటీ సీఎం వద్ద సీపీఆర్‌ఓగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన మరణం జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని అన్నారు. కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

ఎనిమిది వ‌రుసల్లో జాతీయ ర‌హ‌దారి..

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)ను సుమారు రూ.10,410 కోట్లతో 8 వరుసల రహదారిగా (6 లైన్లు + 2 సర్వీస్ రోడ్లు) విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నవంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సర్వీస్ రోడ్ల నిర్మాణంపై క్యూబ్ కంపెనీకి ఇప్పటికే లేఖ పంపినట్లు పేర్కొన్నారు. శంషాబాద్ వద్ద 500 ఎకరాల్లో భారీ ట్రాన్స్‌పోర్ట్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలకు కేవలం మూడు గంటల్లో చేరేలా బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు రూపకల్పన పూర్తయిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో నల్గొండలో ఆటోమొబైల్ వంటి భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, డ్రై పోర్ట్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.

మూసీ ప్రక్షాళనపై దృష్టి

బసవాపూర్ ప్రాజెక్టుకు ₹2,026 కోట్లు, మూసీ కాలువలు మరియు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ డ్రైనేజీ కారణంగా మూసీ నది కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, నదిని శుద్ధి చేయడం తప్పనిసర‌ని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని కొందరు అడ్డుకోవడం బాధాకరమని విమర్శించారు.

Advertisement
Advertisement