CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో రాజకీయాలు వేడెక్కాయి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి.. అమెరికా పర్యటన రద్దు, కేంద్రం వైఖరితో పాటు రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపై ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో రాజకీయాలు వేడెక్కాయి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి.. అమెరికా పర్యటన రద్దు, కేంద్రం వైఖరితో పాటు రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపై ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సిన రేవంత్‌రెడ్డికి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో యూఎస్ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమయ్యారు.
మరికొద్ది గంటల్లోనే ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కేంద్రం నిర్ణయం రాజకీయ కారణాలతోనే జరిగిందని ముఖ్యమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. తన అమెరికా పర్యటనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. లండన్‌లో షెడ్యూల్ ప్రకారం అన్ని సమావేశాలు, కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. మూడు రోజులుగా పార్టీ నేతలు, ప్రజల నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత మిగిలిన అంశాలపై పూర్తి వివరాలతో మాట్లాడతానని స్పష్టం చేశారు.
సుష్మిత వ్యాఖ్యలపై స్పందిస్తారా?
ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ అంశం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే స్పందించారు. తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తనకు, పార్టీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకవైపు కేంద్రంతో పర్యటన విషయంలో నెలకొన్న వివాదం.. మరోవైపు సొంత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌కు చేరుకుంటున్న రేవంత్‌రెడ్డి స్పందనపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ వెనుక కారణాలు, సుష్మిత వ్యవహారంపై ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్
ఆగస్టు 23, 2026

H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
ఆగస్టు 23, 2026

OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘కొండా’ ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
- ●Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్
- ●OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!
- ●Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
- ●Vakiti Srihari | సురేఖ, వాకిటియే కాదు.. ఎవరైనా పార్టీ తర్వాతే
- ●G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది

H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!

Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్

OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!

Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు



