H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
H1N1 | దేశంలో కొత్త రకం హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందుతోందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త వేరియంట్ కాదని తెలిపింది.
H1N1 | దేశంలో కొత్త రకం హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందుతోందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త వేరియంట్ కాదని తెలిపింది. 2025 నుంచే దేశంలో ఉన్న ఇన్‌ఫ్లూయెంజా-ఏ (హెచ్1ఎన్1 పీడీఎం09) వైరస్‌నే ప్రస్తుతం గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న వైరస్‌ను వైద్యపరంగా ‘A/Missouri/11/2025 (H1N1) pdm09-like’గా పేర్కొంది. ఇది 6B.1A.5a2a క్లేడ్, D.3.1.1 సబ్‌క్లేడ్‌కు చెందినదని సమాచారం. గత ఏడాది నుంచే ఈ వైరస్ దేశంలో ఉన్నందున కొత్త వైరస్ వచ్చిందనే భయాందోళనలు అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ ప్రస్తుత సీజనల్ ఫ్లూ టీకా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వైరస్ లక్షణాలు..
హెచ్1ఎన్1 లక్షణాలు ఇతర సీజనల్ ఫ్లూ జ్వరాల మాదిరిగానే ఉంటాయి. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి కనిపించవచ్చు. చాలా మంది విశ్రాంతి తీసుకుంటూ, తగినంత ద్రవాలు తీసుకుంటే కొద్ది రోజుల్లో కోలుకుంటారు. అయితే, చిన్నారులు, వృద్ధులు, ఇప్పటికే ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, ఇతర లక్షణాలు మూడు నాలుగు రోజుల్లో తగ్గకపోయినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని ఐసీఎంఆర్, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) నిఘా వ్యవస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
- ●Vakiti Srihari | సురేఖ, వాకిటియే కాదు.. ఎవరైనా పార్టీ తర్వాతే
- ●G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది
- ●NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్ - ఎన్బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Parliament Monsoon Session | పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యం.. తెరవెనుక కేంద్రం వ్యూహమేంటి?
- ●Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు

Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

Vakiti Srihari | సురేఖ, వాకిటియే కాదు.. ఎవరైనా పార్టీ తర్వాతే

G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది

NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్ - ఎన్బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?




