Government Employees Degree | ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రెగ్యులర్ డిగ్రీ చేస్తున్నారా?.. అయితే ఆ పట్టా చెల్లదు..
Government Employees Degree | మీరు ప్రభుత్వ ఉద్యోగులా?. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఉన్నత చదవులు చదువుతున్నారా?. అయితే ఆ డిగ్రీలు (Government Employees Degree) చెల్లుబాటు కావు. సర్కారు కొలువులో ఉంటూ నిబంధనల ప్రకారం శాఖాపరమైన అనుమతి తీసుకోకుండా పూర్తి చేసిన ఎల్ఎల్‌బీ (రెగ్యులర్) డిగ్రీని ధృవీకరించలేమని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది.
Government Employees Degree | త్రినేత్ర.న్యూస్: మీరు ప్రభుత్వ ఉద్యోగులా?. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఉన్నత చదవులు చదువుతున్నారా?. అయితే ఆ డిగ్రీలు (Government Employees Degree) చెల్లుబాటు కావు. సర్కారు కొలువులో ఉంటూ నిబంధనల ప్రకారం శాఖాపరమైన అనుమతి తీసుకోకుండా పూర్తి చేసిన ఎల్ఎల్‌బీ (రెగ్యులర్) డిగ్రీని ధృవీకరించలేమని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. దానిని సర్వీసు రికార్డుల్లో నమోదుచేయడానికి న్యాయస్థానం నిరాకరించింది.
ఒక ప్రభుత్వ ఉద్యోగి (కోర్టు సిబ్బంది) తన విధుల్లో కొనసాగుతూనే మూడేండ్ల రెగ్యులర్ ఎల్ఎల్‌బీ (LLB) కోర్సును పూర్తి చేశారు. ఆ డిగ్రీని తన సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, పదోన్నతులకు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చేసిన అభ్యర్థనను ఉన్నతాధికారులు తిరస్కరించారు. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీ. సామ్ కోశి, జస్టిస్ లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
1978 నాటి ప్రభుత్వ మెమో ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉన్నత చదువులు చదవాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరని, ఆ నిబంధనను పిటిషనర్ పాటించలేదని తెలిపింది. ఉద్యోగి పనిచేసే ప్రాంతానికి, కళాశాలకు మధ్య ఉన్న దూరం (సుమారు 50 కి.మీ.) దృష్ట్యా, విధులకు ఆటంకం కలగకుండా రెగ్యులర్ కోర్సు చదవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇది విధి నిర్వహణలో క్రమశిక్షణను దెబ్బతీస్తుందని పేర్కొంది. ముందస్తు అనుమతి లేకుండా పొందిన డిగ్రీని తర్వాత ధృవీకరించాలని కోరడం సమంజసం కాదని, అలాంటి డిగ్రీలు సర్వీస్ ప్రయోజనాలకు పనికిరావని కోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
తాజావార్తలు
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!





