Komatireddy Rajagopal Reddy | మూడేండ్ల పాలనల ప్రజలు సంతోషంగా లేరు.. మంచిగ పాలించి పదవులల్ల మీరే ఉండండి
Komatireddy Rajagopal Reddy | తన సొంత ప్రభుత్వంపై తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy)మరోసారి అదే రీతిలో ఫైరయ్యారు.
- మునుగోడుకు నిధులియ్యమని 100 సార్లు అడిగిన.. మళ్లోసారి రేవంత్, భట్టిని అడుగుతున్నా
- తెలంగాణ అంటే ఒక్క కొడంగలే కాదు
- ఇండ్లపొంటి వోయి అడుక్కునే అల్వాటు లేదు నాకు
- మునుగోడు ప్రజలు దమ్మున్న లీడర్‌ను గెలిపిచ్చిర్రు
- నా బత్కంతా కొట్లాటనే అయితుంది
- మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: తన సొంత ప్రభుత్వంపై తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy)మరోసారి అదే రీతిలో ఫైరయ్యారు. మూడేండ్ల పాలనల ప్రజలు సంతోషంగా లేరని.. మంచిగ పాలించి పదవులల్ల మీరే ఉండండని హాట్ కామెంట్స్ (Comments) చేశారు. పదవుల కోసం పాకులాడే అలవాటు తనకు లేదన్నారు. తెలంగాణ అంటే కొడంగల్ ఒక్కటే కాదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను నిధులియ్యమని సూటిగా ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సొంత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నేను నా కుటుంబం బాగనే ఉన్నది. నా జీవితంలో చేయాల్సింది కష్టంలో ఉన్న పేదవాళ్లను ఆదుకోవాలే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలే. ముఖ్యంగా సాగునీళ్లు తీసుకొచ్చి మనుగోడులో మూడు లక్షల ఎకరాల్లో పారియ్యాలే. ఇదే నా లక్ష్యం. మంచినీరు, రోడ్లు ఇంకా అభివృద్ధి పనుల కోసమే నేన్ కష్టపడ్తా తప్పా నాకు ఏం పదవి అవసరం లేదు.
అధిష్టానం అన్నప్పుడు చూస్తా..
మూడేండ్ల పరిపాలన తర్వాత ప్రజలు సంతోషంగా లేరు. మీరు పరిపాలన బాగ చేయండి.. మీరే పదవులల్ల ఉండండి. మా నియోజకవర్గ అభివృద్ధికి నిధులిచ్చి సహకరించండి. మీరేదన్న అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచిస్త తప్తే.. నేన్ మీ ఇంటికివోయి.. పదవుల కోసం ఇండ్ల సుట్టు తిరిగే అలవాటు నాకు లేదు. మునుగోడు ప్రజలు ఒక దమ్మున్న లీడర్‌ను గెలిపిచ్చిర్రు గానీ.. అడుక్కునే లీడర్‌ను కాదు వాళ్లు గెలిపిచ్చింది.
ఈ ఎమ్మెల్యే అసొంటోడు కాదు
మునుగోడు గడ్డకొక చరిత్ర ఉంది. మునుగోడు ఎమ్మెల్యేను ఓడగొట్టాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంల ఉన్న 100 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికొచ్చిర్రంటే ఈ చరిత్ర ఏందో మీరు అర్థం చేస్కోవాలే. ఈ ఎమ్మెల్యే పదవుల కోసం పాకులాడడు. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు అడిగిన. మళ్లొక్కసారి ఈ కార్యక్రమం ద్వారా కూడా అడుగుతున్నా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారిని. తెలంగాణ అంటే ఒక్క కొడంగలే కాదు. గతంల కేసీఆర్ కూడా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అంటడు.. అప్పుడు కొట్లాడిన. నా బతుకంతా కొట్లాటనే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
నవంబర్ 20, 2026

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా
- ●Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..
- ●Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
- ●TG Bhavan | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం
- ●Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..



