త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. మ‌నం వేసే ఓటు ఎన్ని ర‌కాలుగా ఉంటుందో తెలుసా?

Municipal Elections | రాష్ట్రంలో మరికొద్దిసేప‌ట్లో మున్సిప‌ల్‌ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ (Polling) జరగనుంది. పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, అసెంబ్లీ, లోక్‌స‌భ‌.. ఇలా ఎన్నిక‌లు ఏవైనా ఓటు (Vote) మాత్రం ఒక‌టే. అయితే మ‌నం ఓటు వినియోగించుకునే ప‌ద్ధ‌తుల‌ను బ‌ట్టి (Voting Methods) అవి ఐదు రకాలుగా ఉంటాయి.

G

Telangana | Published On Feb 11, 2026, 6.24 am IST

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. మ‌నం వేసే ఓటు ఎన్ని ర‌కాలుగా ఉంటుందో తెలుసా?
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మరికొద్దిసేప‌ట్లో మున్సిప‌ల్‌ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ (Polling) జరగనుంది. మొత్తం ఏడు కార్పొరేష‌న్ల‌లోని 414 డివిజన్లకు, 116 పురపాలికల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో రెండు డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్‌లోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతిచెంద‌డంతో ఎన్నిక వాయిదా పడింది.

మిగిలిన 412 డివిజన్లు, 2,569 వార్డులకు బుధ‌వారం ఉద‌యం 7 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగ‌నుంది. మొత్తం 12,944 మంది అభ్య‌ర్థులు పోటీచేస్తున్నారు. పోలింగ్ కోసం 16,382 బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. 1,379 మంది రిటర్నింగ్‌ అధికారులు, 41,773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

వినియోగించుకునే ప‌ద్ధ‌తిని బ‌ట్టి ఓటు..

కాగా, పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, అసెంబ్లీ, లోక్‌స‌భ‌.. ఇలా ఎన్నిక‌లు ఏవైనా ఓటు (Vote) మాత్రం ఒక‌టే. అయితే మ‌నం ఓటు వినియోగించుకునే ప‌ద్ధ‌తుల‌ను బ‌ట్టి (Voting Methods) అవి ఐదు రకాలుగా ఉంటాయి. అవి..

  • ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ముందుగానే ఓటు వేస్తారు. దానిని పోస్టల్ బ్యాలెట్ అంటారు.
  • ఇక పోలింగ్ రోజున వేసే ఓటును సాధారణ ఓటుగా పిలుస్తారు.
  • నగరానికి దూరంగా ఉండి, పోలింగ్ రోజున రాలేకపోయిన సైనికులు తదితరులు వేసే ఓటును సర్వీస్ ఓటుగా పేర్కొంటారు.
  • ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయలేని సిబ్బంది ప్ర‌త్యేక అనుమ‌తితో తమకు బదులుగా వేరొకరితో ఓటు వేయించడాన్ని ప్రాక్సీ ఓటుగా వ్య‌వ‌హిస్తారు.
  • ఓటరును పోలింగ్ ఏజెంట్ సవాల్ చేసిన సమయంలో, అత‌డు ఓటు వేయడానికి ముందు నిర్ధారించి వేసే దాన్ని చాలెంజ్ ఓటు అంటారు.
  • మీ ఓటును అప్పటికే వేరొక‌రు వేసి ఉంటే, మళ్లీ మీరు వేసే ఓటును టెండర్ ఓటు అంటారు. దీనిని బ్యాలెట్ బాక్సులో వేయకుండా, ఎన్నికల అధికారి వద్ద ఒక ప్రత్యేక కవరులో ఉంచుతారు. ఈ ఓటును ఓట్ల లెక్కింపు రోజున పరిగణనలోకి తీసుకుంటారు.
Advertisement
Advertisement