త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు 

Municipal Elections | మున్సిపల్‌ ఎన్నికల (Municipal Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. తొలుత ఓట్ల‌ను క‌ట్ట‌లు క‌డుతున్నారు. ఆ త‌ర్వాత పోస్ట‌ల్ ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

G

Telangana | Published On Feb 13, 2026, 8.23 am IST

Municipal Elections | ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు 
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిపల్‌ ఎన్నికల (Municipal Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. తొలుత ఓట్ల‌ను క‌ట్ట‌లు క‌డుతున్నారు. ఆ త‌ర్వాత పోస్ట‌ల్ ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. మధ్యాహ్నానికి మున్సిప‌ల్‌, సాయంత్రానికి కార్పొరేష‌న్ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. అలంపూర్ మున్సిప‌ల్ ఫ‌లితం తొలి రౌండ్‌లోనే తేల‌నుండ‌గా, మిర్యాల‌గూడ మున్సిపాలిటీపై జెండా ఎగ‌రేసేదేవ‌రో నాలుగు రౌండ్ల త‌ర్వాత తేలుతుంది.

కాగా, ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. 2,981 వార్డుల్లో 12,944 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు ఉండ‌గా, మిగిలిన‌వారు కౌన్సిల‌ర్లు. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అదేరోజున కార్పొరేష‌న్ల‌లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికుంటారు.

ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 12వేల మంది పోలీసులను మోహ‌రించారు. పోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా బందోబ‌స్తులో పాలుపంచుకుంటున్నాయి. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తుంటామ‌ని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీట‌ర్ల‌ దూరం వరకు ఆంక్షలు ఉంటాయ‌న్నారు. అన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాల‌ని కోరారు.

Advertisement
Advertisement