Chepa Prasadam | నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Chepa Prasadam | త్రినేత్ర.న్యూస్: మృగశిర కార్తెను (Mrigashira) పురస్కరించుకుని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది.
Chepa Prasadam | త్రినేత్ర.న్యూస్: మృగశిర కార్తెను (Mrigashira) పురస్కరించుకుని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ విశిష్ట ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి ఆస్తమా రోగులు భారీగా తరలివచ్చారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తొక్కిసలాటలు, ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఉచితంగా అల్పాహారం, అన్నదానం చేపట్టేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కౌంటర్లను ఏర్పాటు చేశాయి.

40 వేల కొర్రమీను పిల్లలు సిద్ధం..
చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్య శాఖ సమన్వయంతో సుమారు 40 వేల కొర్రమీను (Murrel) చేప పిల్లలను పంపిణీ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచారు. శ్వాసకోశ సమస్యలకు ఈ ప్రసాదం ఎంతో మేలు చేస్తుందనే నమ్మకంతో వచ్చే సాధారణ ప్రజలు, వృద్ధుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో హైదరాబాద్ చేరుకునే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. సికింద్రాబాద్, ఎంజీబీఎస్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS) వంటి ప్రధాన కేంద్రాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఈ బస్సులు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
చేప ప్రసాదం పంపిణ దృష్ట్యా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీ భవన్, గృహకల్ప బస్టాప్‌ల నుంచి రావాలని సూచించారు. ఆటోల్లో వచ్చేవారి కోసం షెజాన్ హోటల్ వద్ద ప్రత్యేక అలైటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 7, 2026

CM Revanth Reddy | నా సభలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●Theft | రాజకీయ నాయకుడి ఇంట్లో రూ.కోటిన్నర చోరీ.. తీసిందెవరో తెలుసుకుని..
- ●Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- ●Travels Bus | డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్.. బస్సులో 36 మంది ప్రయాణికులు
- ●Horoscope | జూన్ 8 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది!
- ●Honey Eating Record | కేవలం ఒక్క నిమిషంలో 1.2 కిలోల తేనెను లాగించేశాడు.. వింత గిన్నిస్ రికార్డ్!
- ●FSSAI Newspaper Ban | న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చిన వేడివేడి సమోసాలు, బజ్జీలు తింటున్నారా? వెంటనే ఆపేయండి.. లేదంటే..?

Theft | రాజకీయ నాయకుడి ఇంట్లో రూ.కోటిన్నర చోరీ.. తీసిందెవరో తెలుసుకుని..

Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Travels Bus | డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్.. బస్సులో 36 మంది ప్రయాణికులు

Horoscope | జూన్ 8 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది!



