త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FSSAI Newspaper Ban | న్యూస్ పేపర్‌లో చుట్టి ఇచ్చిన వేడివేడి సమోసాలు, బజ్జీలు తింటున్నారా? వెంటనే ఆపేయండి.. లేదంటే..?

వేడివేడి సమోసాలు, బజ్జీలను న్యూస్‌పేపర్‌లో ఇస్తున్నారా? అందులోని కెమికల్స్ వల్ల జరిగే నష్టం తెలిస్తే షాక్ అవుతారు. FSSAI ఏం చెప్పిందంటే..

J

Health | Published On Jun 8, 2026, 2.00 am IST

FSSAI Newspaper Ban | న్యూస్ పేపర్‌లో చుట్టి ఇచ్చిన వేడివేడి సమోసాలు, బజ్జీలు తింటున్నారా? వెంటనే ఆపేయండి.. లేదంటే..?
Advertisement
  • ఆహార పదార్థాలను న్యూస్‌పేపర్‌లో ప్యాక్ చేయడంపై FSSAI సీరియస్ హెచ్చరికలు
  • పేపర్‌పై ఉండే ఇంక్‌లోని రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు
  • ముంబైలో వడపావ్ అమ్మే ఒక వ్యక్తిపై చర్యలు తీసుకున్న తర్వాత ఈ తాజా ఆదేశాలు
  • నూనెను పీల్చుకోవడానికి కూడా పేపర్‌ను వాడకూడదని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు స్పష్టీకరణ

FSSAI Newspaper Ban | త్రినేత్ర.న్యూస్ : రోడ్డు పక్కన బండి మీద వేడివేడి బజ్జీలు, సమోసాలు, వడపావ్ కొనుక్కుని తినడం మనలో చాలామందికి ఇష్టం. అయితే, వాటిని న్యూస్‌పేపర్‌లో (Newspaper) చుట్టి ఇస్తే మాత్రం పొరపాటున కూడా తినకండి. ఫుడ్ ప్యాకేజింగ్‌కు న్యూస్‌పేపర్ వాడటంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వివరిస్తూ జూన్ 5న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది.

అసలేం జరిగింది?

ముంబైలో ఓ ఫేమస్ వడపావ్ (Vada pav) వెండర్ ఆహార పదార్థాలను న్యూస్‌పేపర్‌లో చుట్టి ఇస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. దీనిపై FSSAI వెస్ట్రన్ రీజియన్, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ (Joint inspection) చేసి అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్ చేసేవారందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. న్యూస్‌పేపర్‌కు బదులుగా ఫుడ్-గ్రేడ్ పేపర్ (Food-grade paper) లేదా బట్టర్ పేపర్ (Butter paper) మాత్రమే వాడాలని సూచించారు.

FSSAI Warns Against Newspaper Food Packaging Health Risks

చిన్న బండి నుంచి రెస్టారెంట్ల వరకు..

దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ అలవాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, క్లౌడ్ కిచెన్స్, క్యాటరర్స్, క్విక్-సర్వీస్ రెస్టారెంట్లు (QSRs), ఫుడ్ స్టాల్స్, మొబైల్ ఫుడ్ వెండర్స్.. ఎవరైనా సరే ఫుడ్ ప్యాక్ చేయడానికి లేదా సర్వ్ చేయడానికి న్యూస్‌పేపర్ వాడటాన్ని తక్షణమే ఆపేయాలని FSSAI ఆదేశించింది.

న్యూస్‌పేపర్ ఎందుకు వాడకూడదు?

FSSAI చెబుతున్న దాని ప్రకారం.. న్యూస్‌పేపర్‌పై అక్షరాలు ప్రింట్ చేయడానికి వాడే ఇంక్ (Ink)లో ప్రమాదకరమైన కెమికల్స్, లెడ్ (Lead), ఇతర హెవీ మెటల్స్ ఉంటాయి. వేడివేడి ఆహారాన్ని అందులో పెట్టినప్పుడు ఆ రసాయనాలు ఫుడ్‌లోకి చేరి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అంతేకాకుండా, పేపర్ ప్రింటింగ్, రవాణా సమయంలో వాటిపై దుమ్ము, బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ఇవి నేరుగా మన శరీరంలోకి వెళ్తాయి.

నూనె పీల్చుకోవడానికి కూడా..

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్- 2018 ప్రకారం ఫుడ్ ప్యాకింగ్‌లో న్యూస్‌పేపర్ వాడటం పూర్తిగా నిషేధం. కేవలం ప్యాకింగ్ కోసమే కాదు.. సమోసాలు, పకోడీలు, వడపావ్ లాంటివి డీప్ ఫ్రై చేసిన తర్వాత వాటిలోని అదనపు నూనెను పీల్చుకోవడానికి (Absorb oil) కూడా చాలామంది న్యూస్‌పేపర్లను వాడుతుంటారు. ఆ అలవాటును కూడా వెంటనే మానుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement