త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Theft | రాజకీయ నాయ‌కుడి ఇంట్లో రూ.కోటిన్నర చోరీ.. తీసిందెవ‌రో తెలుసుకుని..

Theft | హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్‌లోని (Sanathnagar) ఓ రాజ‌కీయ‌ పార్టీకి (Political Leader) చెందిన నాయకుడి ఇంట్లో భారీ చోరీ (Theft) జ‌రిగింది. ఏకంగా రూ.కోటిన్నర చోరీకి గురయ్యాయి.

G

Hyderabad | Published On Jun 8, 2026, 8.45 am IST

Theft | రాజకీయ నాయ‌కుడి ఇంట్లో రూ.కోటిన్నర చోరీ.. తీసిందెవ‌రో తెలుసుకుని..
Advertisement

Theft | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్‌లోని (Sanathnagar) ఓ రాజ‌కీయ‌ పార్టీకి (Political Leader) చెందిన నాయకుడి ఇంట్లో భారీ చోరీ (Theft) జ‌రిగింది. ఏకంగా రూ.కోటిన్నర చోరీకి గురయ్యాయి. అయితే అస‌లు విష‌యం తెలుసుకుని షాక‌వ్వ‌డం ఆ పొలిటిక‌ల్ లీడ‌ర్ వంత‌య్యింది. ఈ చోరీ గురించి సోషల్‌ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో క‌ల‌క‌లం రేగింది.

స‌న‌త్‌న‌గ‌ర్‌లోని జెక్‌కాలనీలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత.. త్వ‌రలో ఇంట్లో జ‌రుగ‌నున్న వివాహం కోసం న‌గ‌దు జ‌మ‌చేసి రూ.కోటిన్న‌ర‌వ వ‌ర‌కు అల్మారాలో దాచి ఉంచారు. శుక్ర‌వారం కొంత న‌గ‌దు వేరే వారికి ఇవ్వాల్సి ఉండ‌గా అల్మ‌రాలో చూడ‌గా అందులో డ‌బ్బు క‌నిపించ‌లేదు. దీంతో కంగారుప‌డిన ఆయ‌న పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు వివ‌రాల గురించి ఆరా తీశారు. ఇంట్లో వారిని త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ఇంట్లో వారే..

అయితే డ‌బ్బు తీసింది త‌మ కుమార్తెనే అని తేల‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు ఎలాంటి ఫిర్యాదు న‌మోదుచేయ‌కుండానే అక్క‌డినుంచి వెనుదిరిగారు.

Advertisement
Advertisement