Gaddam Vamshi Krishna | యానిమేషన్, ఏఐలో శిక్షణ.. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Gaddam Vamshi Krishna | యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ పొందితే యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamshi Krishna) అన్నారు.
Gaddam Vamshi Krishna | త్రినేత్ర.న్యూస్: యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ పొందితే యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamshi Krishna) అన్నారు. గ్రామీణ విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే వేదికగా ఈ కేంద్రాలు నిలుస్తాయని చెప్పారు. గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో మంథనిలో టాస్క్–ఏవీజీసీ అండ్ కృత్రిమ మేధస్సు కేంద్రం, టాస్క్–సీట్రిఎల్ఎస్ ప్రతిభా కేంద్రాలను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), CtrlS Datacenters Ltd సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రతిభా కేంద్రంలో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందుతుందన్నారు. డిజిటల్ ప్రపంచానికి గ్రామీణ యువతను దగ్గర చేయడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఇప్పటివరకు కృత్రిమ మేధస్సు వంటి కోర్సుల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మంథనిలోనే ఈ అవకాశాలు అందుబాటులోకి రావడం ఆనందమని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతో ఈ కేంద్రాన్ని మంథనిలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వెల్లడించారు. యువత, విద్యార్థులు ఈ టాస్క్ కేంద్రాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






