త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddiraju | పెట్రోల్, డీజిల్ కొరతను వెంటనే నివారించాలి.. అధికారుల‌కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచ‌న‌

MP Vaddiraju | తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.

P

Telangana | Published On Apr 26, 2026, 8.30 pm IST

MP Vaddiraju | పెట్రోల్, డీజిల్ కొరతను వెంటనే నివారించాలి.. అధికారుల‌కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచ‌న‌
Advertisement

MP Vaddiraju | తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులను వెంటనే స్పందించి కొరతను నివారించాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కోరారు.

పెట్రోలియం పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఈ అంశాన్ని తాను ప్రత్యేకంగా దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి హన్మకొండకు ప్రయాణిస్తున్న సమయంలో అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూలలో నిలబడి ఉన్న దృశ్యాలను గమనించినట్లు ఆయన వెల్లడించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు సానుకూలంగా స్పందించారు.

Advertisement
Advertisement