త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | తొర్రూరులో ఎంపీ చామ‌ల గూండాగిరీ.. బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల బ‌స్సుపై దాడి..

Chamala Kiran Kumar Reddy | మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకోవ‌డానికి కాంగ్రెస్ (Congress) పార్టీ బ‌రితెగిస్తున్న‌ది. కిడ్నాపులు, పోలీసుల అండతో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ది. జ‌న‌గామ జిల్లా (Jangaon) తొర్రూరు మున్సిప‌ల్‌ (Thorrur Municipality) చైర్‌ప‌ర్స‌న్, వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు రౌడీ ఇజం ప్ర‌ద‌ర్శించారు.

G

Telangana | Published On Feb 16, 2026, 12.18 pm IST

Chamala Kiran Kumar Reddy | తొర్రూరులో ఎంపీ చామ‌ల గూండాగిరీ.. బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల బ‌స్సుపై దాడి..
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకోవ‌డానికి కాంగ్రెస్ (Congress) పార్టీ బ‌రితెగిస్తున్న‌ది. కిడ్నాపులు, పోలీసుల అండతో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ది. జ‌న‌గామ జిల్లా (Jangaon) తొర్రూరు మున్సిప‌ల్‌ (Thorrur Municipality) చైర్‌ప‌ర్స‌న్, వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు రౌడీ ఇజం ప్ర‌ద‌ర్శించారు. బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల‌తో పాటు మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy), అత‌ని అనుచ‌రులు బ‌స్సుపై దాడిచేశారు.

జ‌న‌గామ మండ‌లం పెంబ‌ర్తి బైపాస్ వ‌ద్ద బ‌స్సును అడ్డుకున్ని, కౌన్సిల‌ర్ల‌ను బెదిరించి కిడ్నాప్ చేసేందుకు య‌త్నించారు. కాగా, బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ నేత‌ల గూండాయిజాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నాయ‌కుల మ‌ధ్య తోపులాట చోటుచేసుకున్న‌ది.

https://x.com/TeluguScribe/status/2023261556168065116

కాగా, జనగామ మునిసిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా చోటుచేసుకున్న‌ది. బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ 28వ వార్డు అభ్యర్థి హఫీజ్ ఫాతిమా భర్త అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో ఫాతిమాను స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసుల యత్నించారు. దీంతో పోలీసుల‌ను ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అడ్డుకున్నారు. డీసీపీతో వాగ్వాదానికి దిగారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ ఫాతిమా స్పష్టం చేయడంతో లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. పోలీసులకు వ్య‌తిరేకంగా ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ వ‌ద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో వారిపై స్ప‌ల్వ లాఠీచార్జ్ చేశారు. ప్ర‌స్తుతం మున్సిప‌ల్ కార్యాల‌యంలో నూత‌నంగా ఎన్నికైన కౌన్సిల‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2023277511728124249

Advertisement
Advertisement