త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | ఎల్పీజీ స‌మ‌స్య‌ను కేంద్రం వెంట‌నే ప‌రిష్క‌రించాలి.. ఎంపీ చామ‌ల డిమాండ్‌

hamala Kiran Kumar Reddy | ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని భువ‌నగిరి ఎంపీ చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు.

G

Telangana | Published On Mar 12, 2026, 12.59 pm IST

Chamala Kiran Kumar Reddy | ఎల్పీజీ స‌మ‌స్య‌ను కేంద్రం వెంట‌నే ప‌రిష్క‌రించాలి.. ఎంపీ చామ‌ల డిమాండ్‌
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని భువ‌నగిరి ఎంపీ చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. దేశంలో నెల‌కొన్న ఎల్పీజీ సమస్యను కేంద్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన‌ ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు, కొర‌త‌పై ఇండియా కూట‌మి ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఈసంద‌ర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 18వ లోక్‌సభలో కేంద్రప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ ప్రభుత్వ అజెండాగా మారిందని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు. ట్రంప్‌కు మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని చెప్పారు.

Advertisement
Advertisement