Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు 83 వేలు.. ఆర్థిక సాయం రూ. 5033.22 లక్షలు
Indiramma Atmiya Bharosa | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్ కలిసి సంబంధిత శాఖా మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
Indiramma Atmiya Bharosa | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్ కలిసి సంబంధిత శాఖా మంత్రిని ప్రశ్నించారు. ఈ పథకం అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని గతేడాది జనవరి 26 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందింస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 5033.22 లక్షలు అందజేసినట్లు వెల్లడించింది.
అర్హులు వీరే.. డీబీటీ పద్ధతిలో నిధులు జమ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా నిర్ధారించాం. ఆ అర్హత గల కుటుంబానికి రెండు విడుతలుగా, ఒక్కో విడత కింద రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేసింది. డీబీటీ పద్ధతిలో నిధులు జమ చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ పథకం అమలు పర్యవేక్షణ రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరిస్తుంది. జిల్లాల్లో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం బాధ్యులుగా ఉంటారని వివరించడం జరిగింది.
దరఖాస్తులు 8 లక్షలు.. లబ్ధిదారులు 83 వేలు..
ఈ పథకం కోసం గ్రామసభల్లో 8,30,302 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులను పరిశీలించగా, అర్హులుగా 5,14,705 మంది ఎంపికయ్యారు. మొత్తంగా 83,887 మంది లబ్ది పొందినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



