America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
America | ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ (Iranian President Masoud Pezeshkian)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భేటీపై అమెరికా (America) తీవ్రంగా స్పందించింది. తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది.
International | Published On Sep 3, 2026, 1.32 pm IST
America | త్రినేత్ర.న్యూస్ : కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ (Bishkek) నగరంలో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ (Iranian President Masoud Pezeshkian)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత భారత్, ఇరాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికలపై అమెరికా (America) తీవ్రంగా స్పందించింది. ఆ వార్తలను అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) తోసిపుచ్చారు.
భారత్-ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని తాము భావించడం లేదని పేర్కొన్నారు. ప్రతి దేశానికీ ఒక స్వతంత్ర విదేశాంగ విధానం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలు టెహ్రాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాయని తెలిపారు. అమెరికా కూడా ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
అయితే, అమెరికా విధానం చాలా స్పష్టంగా ఉందని రూబియో తెలిపారు. తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఆదాయాన్ని సమకూర్చుకునే విధానాలను రూపొందించడంలో ఏ దేశమూ వారికి సహాయపడకూడదని చెప్పారు. ఒకవేళ తమ ఆంక్షలను కాదని ఏ దేశమైనా ఇరాన్‌కు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జరిమానాలు, శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Also Read..
కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ
కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ
24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Singh on Tiger Shroff Firing | గుజరాత్ జైలు నుంచే టైగర్ ష్రాఫ్‌పై దాడికి స్కెచ్
అక్టోబర్ 19, 2026

Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
అక్టోబర్ 17, 2026

US lawmakers letter to Marco Rubio | మార్కో రూబియో పర్యటన వేళ భారత్‌లో నిరసనలపై అమెరికా ఎంపీల లేఖాస్త్రం.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
- ●Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
- ●Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
- ●UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..
- ●India-New Zealand FTA | ఇక జీరో సుంకంతో ఎగుమతులు.. అమలులోకి వచ్చిన భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ!

Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్

UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన



