త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Vijaya Shanthi | ఉద్య‌మ‌కారుల‌కు ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయి..? రేవంత్ స‌ర్కార్‌ను నిల‌దీసిన విజ‌య‌శాంతి

MLC Vijaya Shanthi | తెలంగాణ ఉద్య‌మకారుల‌కు మ‌నం ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయి..? అని రేవంత్ స‌ర్కార్‌ను ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి నిల‌దీశారు. శాస‌న‌మండ‌లిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

S

Telangana | Published On Mar 30, 2026, 6.38 pm IST

MLC Vijaya Shanthi | ఉద్య‌మ‌కారుల‌కు ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయి..? రేవంత్ స‌ర్కార్‌ను నిల‌దీసిన విజ‌య‌శాంతి
Advertisement

MLC Vijaya Shanthi | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్య‌మకారుల‌కు మ‌నం ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయి..? అని రేవంత్ స‌ర్కార్‌ను ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి నిల‌దీశారు. శాస‌న‌మండ‌లిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం.. అది ఇంకా ఇవ్వలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement