త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinnareddy | త‌ప్పుడుగాండ్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపాలి.. లేదంటే నేను మ‌రో జీవ‌న్ రెడ్డి కావాల్సివ‌స్త‌ది: చిన్నారెడ్డి

Chinnareddy | త్రినేత్ర‌.న్యూస్‌: అధికార కాంగ్రెస్‌లో (Congress) రోజురోజుకు అసంతృప్తి పెరుగుతున్న‌ది. సీనియ‌ర్ నేత‌లు సొంత‌పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తాజాగా ఈజాబితాలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం చైర్మ‌న్‌ చిన్నారెడ్డి (Chinnareddy) చేరారు.

G

Telangana | Published On Aug 17, 2026, 11.44 am IST

Chinnareddy | త‌ప్పుడుగాండ్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపాలి.. లేదంటే నేను మ‌రో జీవ‌న్ రెడ్డి కావాల్సివ‌స్త‌ది: చిన్నారెడ్డి
Advertisement

Chinnareddy | త్రినేత్ర‌.న్యూస్‌: అధికార కాంగ్రెస్‌లో (Congress) రోజురోజుకు అసంతృప్తి పెరుగుతున్న‌ది. సీనియ‌ర్ నేత‌లు సొంత‌పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తాజాగా ఈజాబితాలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం చైర్మ‌న్‌ చిన్నారెడ్డి (Chinnareddy) చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డానికి డ‌బ్బు కార‌ణమ‌ని ఆరోపించారు. సొంత‌పార్టీకే చెందిన ప్ర‌స్తుత వనపర్తి (Wanaparthy) ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులతో ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నాడ‌ని, నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన పనులకు అడ్డుపడుతూ, తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా (Jeevan Reddy) మారి తిరగబడతానని హెచ్చరించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవ సంద‌ర్భంగా చిన్నారెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

డబ్బులకు ఆశపడి..

`గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే టికెట్‌ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi).. రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) చెప్పారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారు. కానీ, పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్‌ ఇవ్వలేదు. వ‌న‌ప‌ర్తిని స‌ర్వ నాశ‌నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ప‌ట్ట‌ని వ్య‌క్తిని, గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి.. బీఆర్ఎస్ (BRS) పార్టీ ప‌దేండ్లు అధికారంలో ఉంటే అందులోకి పోయి అన్నీ సంపాదించుకుని మ‌ళ్లీ వ‌చ్చిన‌వారికి టికెట్ ఇచ్చారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజ‌కీయం?. గ‌ణ్‌పూర్‌లో కూడా అదేమాదిరిగా జ‌రిగింది. ఇన్ని త‌ప్పులు చేస్తున్నా మేం భ‌రించి ఊర్కుంటున్నాం. భ‌రించ‌కుంటే మ‌రో జీవ‌న్‌రెడ్డి కావాల్సి వ‌స్తుంది. కాంగ్రెస్ పార్టీ నాది. అలాంటి నాయ‌కుల‌ను బ‌య‌ట‌కు పంపిస్తా కానీ, నేను పోను. వ‌న‌ప‌ర్తిలో పార్టీని క‌ష్ట‌ప‌డి నిర్మాణం చేశా. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 23 జిల్లాల్లో తిరిగా. ఎవ‌రు తిరిగారు 23 జిల్లాలు యూత్ కాంగ్రెస్ (Youth Congress) ప్రెసిడెంట్‌గా. రాజ‌శేఖ‌ర్ రెడ్డితో స‌మానంగా తిరిగా. నేను కాంగ్రెస్‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు. త‌ప్పులు చేస్తున్న ఈ త‌ప్పుడుగాండ్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌దిలేంత వ‌ర‌కు మేం వ‌దిలిపెట్టేది లేదు` అని స్ప‌ష్టం చేశారు.

వ‌న‌ప‌ర్తిని అవినీతిమంగా మార్చారు..

వనపర్తిని అవినీతినిమయంగా మార్చారని చిన్నారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే ఎమ్మెల్యే తన వారికే పనులు ఇవ్వాలంటూ వాటిని ఆపుతున్నారని ఆరోపించారు. సీఎం శంకుస్థాపన చేసిన ఐటీ టవర్‌ నిర్మాణం, నర్సింగాయిపల్లి వద్ద పీజీ కేంద్రంలో బాలికలకు రూ.9 కోట్లతో వసతిగృహం, బాలురకు రూ.15 కోట్లతో హాస్టల్‌ నిర్మాణానికి టెండరు పిలిచారని, కానీ, ఆ పనులు జరగడం లేదని తెలిసి తాను స్వయంగా ఆయా శాఖల మంత్రి, అధికారుల వద్దకు వెళ్లి అడిగానని చెప్పారు. అయితే.. ఆ పనులకు ఎమ్మెల్యేనే అడ్డు పడ్డారని, కాంట్రాక్టర్‌ తన మనిషి కాడంటూ కాంట్రాక్టు రద్దు చేయించారని వారు చెప్పారన్నారు. గోపాల్‌పేట మండలంలో వ్యవసాయ మార్కెట్‌ను ఎమ్మెల్యే అనుచరుడి కోసం ఎక్కడో అడవిలో నిర్మించారని ఆరోపించారు.

ఒక్క వేటుతో నా రాజకీయ జీవితాన్ని..

గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వ‌కున్నా.. కాంగ్రెస్ కోసం ప‌నిచేశాన‌ని, ఇళ్లిళ్లూ తిరిగి పార్టీని గెలిపించాల‌ని ప్ర‌చారం చేశాన‌ని చెప్పారు. డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి త‌న 48 ఏండ్ల రాజ‌కీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద‌ప‌డేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాన్ని పూర్తిగా నాశ‌నం చేశార‌ని వెల్ల‌డించారు. త‌నలాంటి వ్య‌క్తి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే, ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉంటే వ‌న‌ప‌ర్తికి మ‌హ‌ర్ద‌శ వ‌చ్చేద‌న్నారు. త‌న‌కు అవ‌కాశం ఇచ్చి ఉంటే నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత అభివృద్ధి చేసేవాడిన‌ని వెల్ల‌డించారు. . ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు త‌న‌ను తీవ్రంగా బాధిస్తున్నాయ‌ని చెప్పారు.

Advertisement
Advertisement