త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెల‌వాల‌ని మ‌స్తు ఖ‌ర్సువెట్టిన.. ఇప్పుడ‌వ‌న్నీ సంపాదించొద్దా

Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి ఎన్నో డ‌బ్బులు ఖ‌ర్చువెట్టాన‌ని.. ఇప్పుడు అవ‌న్నీ సంపాదించుకోవ‌ద్దా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అలియాస్ గంగుల క‌మలాక‌ర్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 12, 2026, 3.20 pm IST

Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెల‌వాల‌ని మ‌స్తు ఖ‌ర్సువెట్టిన.. ఇప్పుడ‌వ‌న్నీ సంపాదించొద్దా
Advertisement
  • స‌మ‌స్యేదైనా సెటిల్మెంట్ల‌తోనే తేలుస్తం
  • కేటీఆర్‌, హ‌రీశ్‌రావు నా ఎంబ‌డేవ‌డుతున్న‌రు
  • క‌మీష‌న్ల‌లో నాకొక్క‌నికే వాటాలున్న‌యా ఏంది!
  • మాక్ అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అలియాస్ గంగుల క‌మలాక‌ర్‌

Gangula Kamalakar in role of Ponguleti | త్రినేత్ర‌.న్యూస్: కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి ఎన్నో డ‌బ్బులు ఖ‌ర్చువెట్టాన‌ని.. ఇప్పుడు అవ‌న్నీ సంపాదించుకోవ‌ద్దా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అలియాస్ గంగుల క‌మలాక‌ర్ ప్ర‌శ్నించారు. పొద్దున లేస్తే కేటీఆర్, హ‌రీశ్ రావు త‌నఎంబ‌డే ప‌డుతున్నార‌న్నారు. క‌మీషన్ల‌లో నా ఒక్క‌డికే వాటా ఉందా అని వ్యాఖ్యానించారు. శ‌నివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ సంద‌ర్భంగా పొంగులేటి పాత్ర‌లో గంగుల ఆద్యాంతం ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు.

ఉత్త‌మ్‌ను తొక్కి ఇక్క‌డికొచ్చిన

పొద్దున లేస్తే కేటీఆర్, హరీష్ రావు నా మీదనే పడుతున్నరు. నేను ఒక్కడినే కమీషన్లు తీసుకోవడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కి ఇక్కడికొచ్చిన‌. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు అండగా ఉన్నడు. సమస్య ఏదైనా చర్చలు, సెటిల్ మెంట్ల‌తోనే సమస్య పరిష్కరిస్తాం. వెలుగుమట్లలో దళితుల ఇళ్లనే కూలగొట్టాం. భూ భారతీ కాదు.. భూ హారతి చేస్తం. మైనింగ్ అంటే మై ఎర్నింగ్ అధ్యక్షా!

మా ప్రభుత్వం రావడానికి మేం సంచులు మోయలేదా? మరి అవన్నీ ఎలా సంపాదించుకోలే? 22ఏ లో పెట్టినవన్నీ ప్రభుత్వ భూములే. అది మేం చెప్పలేదు, 1908లో బ్రిటిష్ ప్రభుత్వమే చెప్పింది. అయినా మేం సెటిల్మెంట్ చేస్తున్నాం కదా అని గంగుల మాట్లాడుకొచ్చారు.

Advertisement
Advertisement