త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వ‌ర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

TG Weather | వాయువ్య-ప‌శ్చిమ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో తెలంగాణ‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాన‌లు మ‌రో మూడురోజుల పాటు కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. ప‌లుచోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పింది.

P

Telangana | Published On Sep 12, 2026, 3.02 pm IST

TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వ‌ర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Advertisement

TG Weather | వాయువ్య-ప‌శ్చిమ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో తెలంగాణ‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాన‌లు మ‌రో మూడురోజుల పాటు కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. ప‌లుచోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పింది. శ‌నివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ప‌లుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో పాటు ఈదురుగాలుల‌తో కూడిన వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని చెప్పింది.

ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని పేర్కొంది. అలాగే, మంచిర్యాల‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంట‌కు 30-40 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తూ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని తెలిపింది. సోమ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది. ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావ‌ర‌ణ‌శాఖ‌. ఇదిలా ఉండ‌గా.. ఉద‌యం నుంచి తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. కుమ్రంభీం, మంచిర్యాల‌, వ‌రంగ‌ల్‌, మ‌హ‌బాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిశాయి. అత్య‌ధికంగా మంచిర్యాల క‌న్నెప‌ల్లిలో 13.5 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం రికార్డ‌య్యింద‌ని టీజీడీపీఎస్ పేర్కొంది.

Advertisement
Advertisement