Vemula Prashanth Reddy | పేగులు మెడలేసుకుంటే 24 గంటల కరెంట్ రాలే అధ్యక్షా
Vemula Prashanth Reddy | పేగులు మెడలేసుకుంటేనో, లాగుల తొండలు ఇడిస్తేనో 24 గంటల కరెంట్ రాలేదని.. దాని వెనక కేసీఆర్ ఎంతో కష్టం దాగి ఉందని బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రతిరోజు బుక్క నోట్లె వెట్టుకుంటూనే కేసీఆర్ కరెంటోళ్లకు ఫోన్లు చేసి మాట్లాడేదని చెప్పారు.
- దాని వెనక కేసీఆర్ కష్టం ఎంతో ఉంది
- రేవంత్‌రెడ్డి మళ్లా చీకటి రోజులు తెస్తున్నడు
- మాక్ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్: పేగులు మెడలేసుకుంటేనో, లాగుల తొండలు ఇడిస్తేనో 24 గంటల కరెంట్ రాలేదని.. దాని వెనక కేసీఆర్ ఎంతో కష్టం దాగి ఉందని బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రతిరోజు బుక్క నోట్లె వెట్టుకుంటూనే కేసీఆర్ కరెంటోళ్లకు ఫోన్లు చేసి మాట్లాడేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కరెంట్ సమస్యనే కేసీఆర్‌కు ప్రేరణగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ నేడు కరెంట్ కోసం రైతులు రోడ్ల మీదికి వచ్చే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇన్వెంటర్లు, జనరేటర్లతో మళ్లా పాత రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
రైతులు కరెంట్, యూరియా సమస్యలను ఎదుర్కుంటున్నారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి సభలో లేడు. కరెంట్ రావడం లేదని రైతులు రోడ్లపైకి వస్తున్నారు. పాత రోజులు మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కరెంట్ లేక పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు. కరెంట్ సమస్యనే ఉద్యమంలో కేసీఆర్ ప్రేరణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ సమస్య ఉంటుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
పేగులు మెడలో వేసుకుంటే 24 గంటల కరెంట్ రాలేదు. ఎంతో కష్టపడి 24 గంటల కరెంట్ తెచ్చిన ఘనత కేసీఆర్ ది. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. లక్ష 30 వేల కోట్ల రూపాయలు కరెంట్ కోసం కేసీఆర్ ఖర్చు చేశారు. 24 గంటలు కరెంట్ ఇవ్వబట్టే వరి ధాన్యం ఎక్కువగా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సరిగా ఇవ్వడం లేదు. మల్లొకసారి చీకటి రోజులు రేవంత్ రెడ్డి తెస్తున్నాడు. 7 గంటల కరెంట్‌తో రైతులు నీళ్ళను ఎలా పారించుకోవాలి? 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరెంట్ సమస్యపై ప్రశాంత్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా మాక్ అసెంబ్లీలో కరెంట్ కట్ కావడం గమనార్హం.
సంబంధిత వార్తలు

Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త
సెప్టెంబర్ 12, 2026

Jagadeesh Reddy | నీళ్లన్నీ ఆంధ్రాకు దోచుకెళ్తున్నరు
సెప్టెంబర్ 12, 2026

Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Miss England Allegations Congress | దీనికి ఏమైనా సమాధానం ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ?
- ●Minister Komatireddy | నాగ్‌పూర్–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే 2027 డిసెంబర్ నాటికి పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
- ●Zomato | జొమాటో బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు ఛార్జీలు
- ●Harish Rao | వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు ధ్వజం
- ●SIP Vs EPF | ఎస్ఐపీ వర్సెస్ ఈపీఎఫ్.. రెండింటిలో ఏది ఎక్కువ రాబడి ఇస్తుంది..?
- ●Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త

Miss England Allegations Congress | దీనికి ఏమైనా సమాధానం ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ?

Minister Komatireddy | నాగ్‌పూర్–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే 2027 డిసెంబర్ నాటికి పూర్తి : మంత్రి కోమటిరెడ్డి

Zomato | జొమాటో బాదుడు.. క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు ఛార్జీలు

Harish Rao | వినాయక చవితి వేళ ఆర్టీసీ చార్జీల మోత.. కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు ధ్వజం



