త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Kavitha | ట్రిపుల్ ఆర్ వ‌ల్ల చౌటుప్ప‌ల్ రెండు ముక్క‌లవుతుంది.. క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

MLC Kavitha | ట్రిపుల్ ఆర్ వ‌ల్ల చౌటుప్ప‌ల్ రెండు ముక్క‌ల‌వుతుంది అని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Dec 24, 2025, 12.50 pm IST

MLC Kavitha | ట్రిపుల్ ఆర్ వ‌ల్ల చౌటుప్ప‌ల్ రెండు ముక్క‌లవుతుంది.. క‌విత కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

MLC Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : ట్రిపుల్ ఆర్ వ‌ల్ల చౌటుప్ప‌ల్ రెండు ముక్క‌ల‌వుతుంది అని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడారు.

RRR కోసంపెద్ద వాళ్ల భూములను తప్పించి పేద వాళ్ల భూములను తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణలో 8 జిల్లాల్లో ఇదే తీరు కొనసాగుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు వల్ల చౌటుప్పల్ రెండు ముక్కలవుతుంది. రాయగిరి రైతులు ఇప్పటికే అనేక సార్లు భూములు త్యాగం చేశారు. నాయకుల అవినీతి కోసం అలైన్మెంట్‌ని మారుస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి అని క‌విత డిమాండ్ చేశారు.

రీజిన‌ల్ రింగ్ రోడ్ల‌ను ప‌ట్ట‌ణాల‌కు వెలుప‌లి నుంచి నిర్మిస్తారు. ఎందుకంటే హెవీ వెహిక‌ల్స్ ప‌ట్ట‌ణాల మ‌ధ్య నుంచి పోకుండా ఉండేందుకు.. త‌ద్వారా ప్ర‌మాదాల‌ను త‌గ్గించేందుకు. కానీ ఈ ట్రిపుల్ ఆర్ అర్థం కాని ప‌రిస్థితిలో ఉంది. అలైన్‌మెంట్ ఒక్కొక్క చోట మూడు నుంచి నాలుగు సార్లు మారింది. జ‌న‌వాసాల‌కు ఇబ్బంది లేకుండా రీజిన‌ల్ రింగ్ రోడ్డు చేప‌డుతామ‌ని ఎన్‌హెచ్ఏఐ చెప్పింది. శాటిలైట్‌లో మ్యాప్ గీశామంటే మార్చ‌డానికి అవ‌కాశం లేద‌న్నారు. కానీ నాలుగు సార్లు అలైన్‌మెంట్ మార్చారు. నాయ‌కుల అవినీతి కోసమే ఈ అలైన్‌మెంట్ మార్చారని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో దారుణమైన పరిస్థితి ఉంది. పదేళ్ల కింద మేమేంతా కొట్లాడితే నిమ్స్‌ని ఎయిమ్స్‌గా మార్చారు. ఈరోజుకీ ఎమర్జెన్సీ పేషంట్ వస్తే ముట్టుకుని వైద్యం చేసే వాళ్లు ఎవరూ లేరు. పేరుకే 120 మంది డాక్టర్లు, 400 మంది నర్సులు అని చెప్తున్నారు. డబ్బులు చెల్లించినా కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నాడు అని చెప్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి దీనిపై దృష్టి పెట్టి సమస్యని పరిష్కరించాలని ఎమ్మెల్సీ క‌విత సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement