MLC Kavitha | సీఎం రేవంత్‌కు దమ్ముంటే.. ఆ 900 ఎకరాలను రైతులకు తిరిగివ్వాలి.. కవిత డిమాండ్
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. వట్టెం రిజర్వాయర్ కింద రైతుల వద్ద తీసుకున్న 900 ఎకరాలను వారికి తిరిగి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. వట్టెం రిజర్వాయర్ కింద రైతుల వద్ద తీసుకున్న 900 ఎకరాలను వారికి తిరిగి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్‌ను కవిత పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంతో అన్ని జిల్లాల్లో తిరగాలనే సకంల్పంతో ఆయా జిల్లాల్లో ఉండే క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని కవిత తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో ఇప్పటి వరకు రైలు కూత వినపడలేదు. గద్వాల - మాచర్ల లైన్ పూర్తయితే రైలు కూత వినపడే అవకాశం ఉంది. రైలు వచ్చే పని ఉమ్మడి ఏపీలో జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏండ్లు అయినా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడన్న నాగర్‌కర్నూల్ ఎంపీ శ్రద్ధ తీసుకోవాలి. రైలు మార్గం వస్తే అభివృద్ధి జరుగుతుంది అని కవిత పేర్కొన్నారు.
నీళ్లల్లో నిప్పు రవ్వలు రగిలిందే నీటి వాటా కోసం..
తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆయా జిల్లాల్లో విద్యాలయాలు, హాస్పిటల్స్, వాటర్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాం. ఇవాళ వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించాం. ఎల్లూరు రిజర్వాయర్‌ను కూడా పరిశీలిస్తాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కృష్ణా జలాల్లో మనకు అన్యాయం జరిగింది. అసలు యుద్ధం జరిగిందే నీళ్లల్లో నిప్పు రవ్వలు రగిలిందే నీటి వాటా కోసం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 308 కి.మీ. పారుతది. నీళ్లను పూర్తిస్థాయిలో వాడుకోలేదు. 299 టీఎంసీలు వాడుకునే పిరస్థితి ఉందని చెప్పారు కానీ వాడుకోలేదు. 550 టీఎంసీలు రావాలి మనకు.. పాలమూరు - రంగారెడ్డి కట్టినప్పుడు 90 టీఎంసీలతో కడుతున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. కాళేశ్వరం ఉరుకులు పరుగులు పెట్టినట్టు పాలమూరు పరుగులు పెట్టి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది అని కవిత పేర్కొన్నారు.
45 టీఎంసీలు చాలని ఉత్తరం రాసింది..
తెలంగాణ ఏర్పటయ్యాక ఉమ్మడి పాలమూరులో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు. అది వాస్తవం. 30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉమ్మడి పాలమూరులో 25 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారు. అంటే 12 ఏండ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం తక్కువ. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల పెద్ద నష్టం జరిగింది. వరద నీరు చెప్పి ఏపీ ప్రాజెక్టులు కడుతుంది. కాబట్టి వారికి ట్రిబ్యునల్స్ మద్దతు తెలుపుతుంది. ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి ఉంటే 90 టీఎంసీల హక్కు మనకు వస్తుండే. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది ఉన్న 90 టీఎంసీలను కూడా ఊడగొట్టి.. 45 టీఎంసీలు చాలని ఉత్తరం రాసింది అని కవిత ధ్వజమెత్తారు.
గురువును సంతృప్తి పరిచేందుకు పాలమూరును పక్కన పెట్టిండు..
పాలమూరు ఎత్తిపోతలలో 21 ప్యాకేజీలు ఉన్నాయి.. వికారాబాద్, రంగారెడ్డి, డిండి ప్యాకేజీలు ఎగిరిపోయాయి. మిగిలిన 18 ప్యాకేజీల్లో నారాయణపేట - కొడంగల్ అని కొత్త స్కీం పెట్టిండు రేవంత్ రెడ్డి. దీనికి ఇన్‌టెక్ పాయింట్ బీమాలో పెట్టుకున్నడు. ఇన్‌టెక్ పాయింట్ జూరాలలో పెట్టుకుంటే ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటది. ఈయన కూడా గురువును సంతృప్తి పరిచేందుకు పాలమూరు ఎత్తిపోతలను కంప్లీట్‌గా పక్కన పెట్టిండు అని అర్థమవుతుంది. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవటానికి అప్పజెప్పారు. ఇప్పుడు ఆ 900 ఎకరాల భూమి ఏమైంది? ఆ భూమంతా కాంట్రాక్టర్ల చేతిలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ 9 వందల ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వాలి అని కవిత డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్..
నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీ కోసం దళితులకు కేటాయించిన 40 ఎకరాల అసైన్డ్ భూములను దౌర్జన్యం చేసి వారి నోళ్లు మూయించి భూములను గుంజుకున్నారు. ఈ భూముల విషయంలో కలెక్టర్ కచ్చితంగా రివ్యూ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్‌ను మాత్రమే నమ్ముకున్నడు. కొడంగల్ - నారాయణ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయకున్న వెయ్యి కోట్లు మేఘా కృష్ణా రెడ్డికి, వెయ్యి కోట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెల్లించిండు అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



