త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Vemula Prashanth Reddy | అధ్వాన్నంగా ఆర్ అండ్ బీ, పంచాయ‌తీ రాజ్ రోడ్లు : ఎమ్మెల్యే వేముల‌

MLA Vemula Prashanth Reddy | రాష్ట్రంలో పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు అధ్వాన్నంగా మారాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మోకాలు లోతు గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న, అందులో పడి గాయాలు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Apr 1, 2026, 3.34 pm IST

MLA Vemula Prashanth Reddy | అధ్వాన్నంగా ఆర్ అండ్ బీ, పంచాయ‌తీ రాజ్ రోడ్లు : ఎమ్మెల్యే వేముల‌
Advertisement

MLA Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు అధ్వాన్నంగా మారాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. మోకాలు లోతు గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న, అందులో పడి గాయాలు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ప్ర‌శాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వర్షాకాలం రాగానే రోడ్ల మరమ్మతులు చేస్తారు, గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఎలాంటి రిపేర్‌లు, మరమ్మతులు చేయడం లేదు. ఆర్మూరు నుండి భీంగల్ పోయే రోడ్డు, రెండు నియోజకవర్గాలకు మధ్య బ్రిడ్జి డ్యామేజ్ అయితే, ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు అటు వైపు వెళ్లి చూడలేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి, వారు నిర్మించే రోడ్లపై మాత్రమే డబ్బాలో రాళ్లు వేసి ఊపితే సాండ్ వచ్చేలా గడగడ మాట్లాడడు తప్ప ఉపయోగకరం లేదు అని వేముల ప్ర‌శాంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నాయి కాని విడుదల చేసిన నిధులు కేవలం 25శాతం మాత్రమే. R&B నిధులు పెడుతున్నారే తప్పా, ఖర్చు చెయ్యడం లేదు అందుకే రోడ్లన్నీ మోకాలు లోతు గుంతలతో ఉంటున్నాయి. సోషియో ఎకానమీ సర్వేలో కూడా ఇదే చెప్పింది. R&B కి నిధులు పెడుతున్నారు ఖర్చు మాత్రం చేయ‌డం లేదు. 25 శాతం నిధులు మాత్రమే విడుదల చేయడంతో రోడ్ల మరమ్మతులకు, నిర్మాణాలకు కొత్తగా కాంట్రాక్టర్లు రావడం లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో మేము విడుదల చేసిన నిధులు 25 వేల కోట్లు. దాదాపు ప్రతి సంవత్సరం రూ. 2600 కోట్లు యావరేజ్ విడుదల చేశాం. మేము పని చేసినంత పని చేయాలి అంటే మినిమం యావరేజ్ ప్రతి సంవత్సరం రూ. 4000 కోట్లు విడుదల చేయాలి. రూ. 4 వేల కోట్లు విడుద‌ల చేయాల్సిన ద‌గ్గ‌ర కేవ‌లం రూ. 1200 కోట్లు మాత్ర‌మే విడుదల చేయడంతో రోడ్ల ఇంత అధ్వాన్నంగా తయ్యార‌య్యాయని ప్రశాంత్ రెడ్డి మండిప‌డ్డారు.

డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు 524 వర్క్ మొత్తం 2070 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే. ప్లాన్ నాన్ ప్లాన్ కలిపి 49 పనులు మాత్రమే పూర్తి అయ్యాయని మంత్రి స‌మాధానం ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల కాలంలో ఇంత చేశాం అని స్వయంగా మంత్రి చెప్పాడు. 2,070 కిలోమీటర్ల పనులు శాంక్షన్ అయితే 112 కిలోమీటర్లు పూర్తి చేశారు. అంటే కేవలం 5 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాతవి, కొత్తవి కలిపి 300 కిలోమీటర్ల పని మాత్రమే చేశారు. అంటే అన్ని నియోజకవర్గాలలో యావరేజ్‌గా 3 కిలోమీటర్ల పని మాత్రమే చేశారు. మా హయంలో తొమ్మిదేండ్ల‌లో సింగిల్ లైన్ టు డబుల్ లైన్ కొత్తగా 8 ,439 కిలోమీటర్ల రోడ్లు వేశాం. గత 60 ఏండ్ల‌లో 6000 కిలోమీటర్ల మాత్రమే రోడ్లు వేస్తే. కేసీఆర్ హయాంలో 485 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు వేశామ‌ని మాజీ మంత్రి తెలిపారు.

బిల్డింగ్ నిర్మాణంలో 60 సంవత్సరాల కాలంలో 30 లక్షల స్కేర్ ఫీట్స్ మాత్రమే. అదే బిఆర్ఎస్ హయంలో R&B బిల్డింగ్స్‌లో ఒక కోటి 2 లక్షల స్కేర్ ఫీట్స్ నిర్మించాం. క్రికెట్ మ్యాచ్ గెలిస్తే బిఆర్ఎస్ హయంలో కట్టిన సచివాలయం దగ్గర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం నిర్మించాం. ఇప్పుడు ఆ విగ్ర‌హం ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం నోచుకోవ‌డం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్డుకు ఇంత వరకు ఆమోదం రాలేదు, రింగ్ రోడ్డు టెండర్లు ఓపెన్ చెయ్యలేదు. సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ మేము చేసిందే అని మాజీ మంత్రి తెలిపారు.

రోడ్ల అభివృద్ధి పేరిట హ్యామ్ మోడల్ రోడ్స్ తెస్తున్నారు. హ్యామ్ రోడ్స్ లో 8 వేల కోట్ల రూపాయల స్క్యామ్ జరుగుతుంది. 6 వేల కిలోమీటర్ల హ్యమ్ మోడల్ రోడ్లలో 13 వేల కోట్ల రూపాయల టెండర్ పిలిచారు. ఈ టెండర్‌లో మొబిలైజేషన్ క్రింద 10 శాతం ముందే ఇస్తామని అంటున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 13 వందల కోట్లు ముందే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ డబ్బులు తిరిగి ఎక్కడికి వస్తాయో అందరికీ తెలుసు. ఈ టెండర్‌లో ఎక్సెస్ టెండర్ వేసుకోండి సలహాలు ఇస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల్లో 8 వేల కోట్ల రూపాయల దోపిడి జరుగుతుంది. హ్యమ్ మోడల్‌లో సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్‌కు మార్చేందుకు కిలో మీటర్‌కు 3 కోట్ల 30 లక్షల రూపాయలు పెట్టారు. 10 వేల కోట్ల రూపాయలు మెయింటైన్ కోసం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుంది. దోపిడే లక్ష్యంగా హ్యమ్ మోడల్ రోడ్లు తెస్తున్నారు. హ్యమ్ మోడల్ రోడ్ల విషయంలో ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసుకోవాలి. జే ఇన్‌ఫ్రా, బృందా ఇన్‌ఫ్రా కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు, ఈ కంపెనీలు R&Bలో పనులు దాఖలాలు లేవు, దీని పై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం. బిజెపి ఎంపీలు జోక్యం చేసుకొని హ్యమ్ మోడల్ రోడ్లలో జరుగుతున్న అవినీతి కాపాడాలి, లేదంటే బిజెపికి ఇందులో భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది అని ప్ర‌శాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement