Vakiti Srihari | నరనరనా నేను హిందువును.. బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి వాకిటి కౌంటర్
Vakiti Srihari | నేను గుడికి పోయి బొట్టు పెట్టి దేవుడికి మొక్కనిది నీళ్లు తాగను.. నాకూ దేవుడు ఉన్నాడు.. నరనరనా నేను హిందువును అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం సబ్జెక్టును డైవర్ట్ చేయొద్దు అని హెచ్చరించారు. గాంధీని గాడ్సేను చంపారు.. దీన్ని సమర్థిస్తారా..? లేదా..? అని సూటిగా అడిగారు.
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్ : నేను గుడికి పోయి బొట్టు పెట్టి దేవుడికి మొక్కనిది నీళ్లు తాగను.. నాకూ దేవుడు ఉన్నాడు.. నరనరనా నేను హిందువును అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం సబ్జెక్టును డైవర్ట్ చేయొద్దు అని హెచ్చరించారు. గాంధీని గాడ్సేను చంపారు.. దీన్ని సమర్థిస్తారా..? లేదా..? అని సూటిగా అడిగారు.
శాసనసభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నేను కూడా హిందువున్నే.. ప్రతిరోజు బొట్టుపెట్టుకొని దేవున్ని మొక్కుతా. ప్రపంచ దేశాలు మోకరిల్లి మహాత్మాగాంధీకి దండం పెడుతున్నాయి. అంతటి గొప్పవ్యక్తి గాంధీజీని చంపిన గాడ్సేను పొగిడితే ఏట్లా? గాడ్సేను బీజేపీ నేతలు పొగిడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. గాంధీజీని గాడ్సే చంపడం తప్పని చెప్పే ధైర్యం ఉందా? అని వాకిటి శ్రీహరి నిలదీశారు.
భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది. మతాలను అన్వయించుకోవడం కాదు.. ఆచరణ రూపం ఉండాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించనవారు సర్ధార్ వల్లభాయి పటేల్. అలాంటి వల్లహభాయి పటేల్ గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరం. మన ధర్మాలను కాపాడుకుంటూ..ఇతర ధర్మాలను గౌరవించుకోవాలి. హిందువుగానే పుట్టిన.. హిందువుగానే మరణిస్తాను. శ్లోకం, మత ప్రబోధాలను అనర్గళంగా మాట్లాడగలను.. ఏ విషయంపైనా అయినా రెండు గంటలు మాట్లాడే శక్తి ఉందని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



