Vakiti Srihari | మక్తల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా.. ఇప్పుడు కొత్తగా 4,085 పెన్షన్లు మంజూరు చేశాం
Vakiti Srihari | మక్తల్ (Makthal) నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే బాధ్యత తనదేనని.. ఇందులో భాగంగా కొత్తగా 4,085 పెన్షన్లను (Pensions) మంజూరు చేసినట్లు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు.
- పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
- మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ లక్ష్యం
- పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | త్రినేత్ర న్యూస్: మక్తల్ (Makthal) నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే బాధ్యత తనదేనని.. ఇందులో భాగంగా కొత్తగా 4,085 పెన్షన్లను (Pensions) మంజూరు చేసినట్లు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. రాష్ట్రంలో బీద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మక్తల్ పట్టణంలో కొత్తగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను సోమవారం మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాకిటి మాట్లాడారు.
కృష్ణా, మాగనూరు, నర్వ, ఉట్కూర్, మక్తల్ మండలాలకు కలిపి మొత్తం 4,085 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన పేదలకు రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. పెన్షన్లు, సాగునీరు, తాగునీరు, డ్యామ్‌లు అంటేనే కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు అందించడంతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలను సైతం మహిళలకు అప్పగిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు. మహిళలు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
యజ్ఞంలా గృహ ప్రవేశ వేడుకలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం కాగితాలకే పరిమితమవుతుందని గతంలో ప్రతిపక్షాలు విమర్శించాయని, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు ఒక యజ్ఞంలా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ షాపుల ద్వారా నెలకు ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, నీటిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. కరువు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకుని నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
జనవరి నుంచి పాదయాత్ర
జనవరి నెల నుంచి మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని మంత్రి ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో చూడని విధంగా ప్రజా ప్రభుత్వం వచ్చాక మక్తల్ అభివృద్ధిలో కొత్త మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా మక్తల్ అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై కొందరు ఎదురుదాడులకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. విమర్శలకు భయపడకుండా ప్రజల కోసం పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచే పార్టీ అని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం ఒకవైపు పేదలకు పెన్షన్లు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్థిక చేయూత వంటి సంక్షేమ పథకాలను అందిస్తూనే మరోవైపు మౌలిక వసతులు, సాగునీరు, తాగునీరు, రహదారుల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Suresh Gopi | పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..
- ●Cherlapally Railway Station Fire | బ్రేకింగ్ న్యూస్: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న రైలు బోగీలు!
- ●Indian Journalists Union | ఐజేయూ కౌన్సిల్ సభ్యులుగా భాస్కర్, సర్వేశ్వర్ రెడ్డి రెండోసారి ఎన్నిక
- ●Anirudh | పెళ్లైనా ఐదు రోజులకే షాక్ - స్టార్ హీరో సినిమా నుంచి అనిరుధ్ ఔట్
- ●India Electrification | 2035 నాటికి భారత్కు భారీ ఊరట.. ఇంధన దిగుమతుల్లో రూ.9.6 లక్షల కోట్లు ఆదా..
- ●Khelo India Youth Games 2026 | తెలంగాణలో 'ఖేలో ఇండియా' క్రీడా జాతర: 6 నగరాల్లో 8 వేల మంది అథ్లెట్ల సందడి

Suresh Gopi | పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..

Cherlapally Railway Station Fire | బ్రేకింగ్ న్యూస్: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న రైలు బోగీలు!

Indian Journalists Union | ఐజేయూ కౌన్సిల్ సభ్యులుగా భాస్కర్, సర్వేశ్వర్ రెడ్డి రెండోసారి ఎన్నిక

Anirudh | పెళ్లైనా ఐదు రోజులకే షాక్ - స్టార్ హీరో సినిమా నుంచి అనిరుధ్ ఔట్








