త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anirudh | పెళ్లైనా ఐదు రోజుల‌కే షాక్ – స్టార్ హీరో సినిమా నుంచి అనిరుధ్ ఔట్‌

పెళ్లైనా ఐదు రోజుల‌కే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌కు షాక్ త‌గిలిన‌ట్లు స‌మాచారం. శింబు అర‌స‌న్ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా అతడిని ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగానే అనిరుధ్‌ను కాద‌ని మ‌రో యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు వెట్రిమార‌న్ ఛాన్స్ ఇచ్చిన‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

N

Entertainment | Published On Nov 16, 2026, 7.10 pm IST

Anirudh | పెళ్లైనా ఐదు రోజుల‌కే షాక్ – స్టార్ హీరో సినిమా నుంచి అనిరుధ్ ఔట్‌
Advertisement

Anirudh | కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఇటీవ‌లే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ఓన‌ర్ కావ్య మార‌న్‌తో ఏడ‌డుగులు వేశాడు. గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మార‌న్ డెస్టినేష‌న్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జ‌రిగింది. వీరి పెళ్లికి 150 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పెళ్లి వేడుక‌ల‌ను ముగించుకున్న ఈ జంట ఇటీవ‌ల ఇండియాకు వ‌చ్చారు. ఈ నెల 21న అనిరుధ్‌, కావ్య‌మార‌న్ రిసెప్ష‌న్ చెన్నైలో జ‌రుగ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

శింబు హీరోగా...

పెళ్లైనా ఐదు రోజుల‌కే అనిరుధ్‌కు షాక్ త‌గిలింది. స్టార్ హీరో సినిమా నుంచి అత‌డిని ప‌క్క‌న‌పెట్టిన‌ట్లుప్ర‌చారం జ‌రుగుతోంది. శింబు హీరోగా వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌స‌న్ పేరుతో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది.

క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌...

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అనిరుధ్ పేరును అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్‌లో అనిరుధ్‌కు, డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్‌కు మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ మొద‌లైన‌ట్లు స‌మాచారం. అనిరుధ్ స్టైల్‌తో పాటు మ్యూజిక్ విష‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేసిన వెట్రిమార‌న్ అత‌డిని ఈ సినిమా నుంచి త‌ప్పించిన‌ట్లు స‌మాచారం.

సంగీత ద‌ర్శ‌కుల‌తో...

తాను డైరెక్ష‌న్ చేసే సినిమాల‌కు సంబంధించి సంగీత ద‌ర్శ‌కుల‌తో క‌లిసి కూర్చొని మ్యూజిక్ చేయించుకుంటుంటారు వెట్రిమార‌న్‌. కానీ అనిరుధ్ మాత్రం డైరెక్ట‌ర్ తీసిన ఫుటేజ్‌ను త‌న స్టూడియోకు తెప్పించుకొని సంగీతం అందిస్తుంటారు. ఈ విష‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌లైన‌ట్లు స‌మాచారం.

కోలీవుడ్ డైరెక్ట‌ర్‌....

అర‌స‌న్ రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోండ‌టంతో మ్యూజిక్‌కు ఎక్కువ‌ రోజులు టైమ్‌ కేటాయించాల‌ని అనిరుధ్‌ను వెట్రిమార‌న్ కోరిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌లు స్టార్ హీరోల సినిమాల‌తో బిజీగా ఉన్న అనిరుధ్‌.. వెట్రిమార‌న్ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు చెబుతున్నారు. చాలా త‌క్కువ రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. అనిరుధ్ నిర్ణ‌యంతో హ‌ర్టైన కోలీవుడ్ డైరెక్ట‌ర్ అత‌డిని ప‌క్క‌న‌పెట్టి అర‌స‌న్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా లిడియ‌న్ నాద‌స్వ‌రం అనే యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన అస‌ర‌స్ దీపావ‌ళి గ్లింప్స్‌లో అనిరుధ్ పేరు క‌నిపించ‌క‌పోవ‌డం ఈ రూమ‌ర్ల‌కు బ‌లాన్ని చేకూర్చుతోంది. అర‌స‌న్ నుంచి అనిరుధ్ ప‌క్క‌న‌పెట్ట‌రంటూ వ‌స్తోన్న రూమ‌ర్లు కోలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారాయి.

 

Advertisement
Advertisement