Vakiti Srihari | అకారణంగా నిందలు వేయొద్దు.. బీజేపీ అభ్యర్థి మృతితో నాకెలాంటి సంబంధం లేదు: మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | మక్తల్ (Makthal) మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ (BJP) అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. అకారణంగా ఎవరిపైనా నిందలు వేయొద్దని చెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమేనని తెలిపారు.
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్: మక్తల్ (Makthal) మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ (BJP) అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. అకారణంగా ఎవరిపైనా నిందలు వేయొద్దని చెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమేనని తెలిపారు.
మహదేవప్పకు తాను ఎప్పుడూ కాల్ చేయలేదని, అవసరమైతే కాల్ డేటా పరిశీలించాలన్నారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎవరినైనా బెదిరించినట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు. రాజకీయ లబ్ది కోసం తనపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. ఎన్నికల భయంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారని వెల్లడించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోందని స్పష్టం చేశారు.
కాగా, మహదేవప్ప మరణంపై ఆయన భార్య సత్యమ్మ స్పష్టతనిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతానేమోనన్న భయంతోనే తన భర్త మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. తనకు ఎవరూ ఓటు వేయరని భయపడ్డారని వెల్లడించారు. ఆయన మరణంపై తమకు ఎవరిపైనా అనుమానాలు లేవన్నారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
- ●Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ - బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?
- ●Subhash Chandra | సుభాష్ చంద్రకు బ్యాంకుల షాక్.. అప్పీలేట్కి వెళ్లనున్న ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు..
- ●బయటపడ్డ బయోలాజికల్ వార్.. మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్ల ఎంట్రీపై భగ్గుమంటున్న నిరసనలు!
- ●Harish Rao | రేవంత్! దివ్యాంగులపై మానవత్వం లేదా? వారికిస్తానన్న రూ.6,000 పెన్షన్ ఏది?
- ●realme C100i | రూ.14,999కే రియల్మి కొత్త ఫోన్.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ..

Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం

Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ - బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?

Subhash Chandra | సుభాష్ చంద్రకు బ్యాంకుల షాక్.. అప్పీలేట్కి వెళ్లనున్న ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు..

బయటపడ్డ బయోలాజికల్ వార్.. మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్ల ఎంట్రీపై భగ్గుమంటున్న నిరసనలు!






