Minister Tummala Nageswara Rao | మే 4 నుంచి రైతు వారోత్సవాలు : మంత్రి తుమ్మల
Rythu Varostavalu | తెలంగాణ ప్రభుత్వం రైతుల అవగాహన పెంపొందించేందుకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నది. ఈ కార్యక్రమాన్ని మే 4 నుంచి మే 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల మార్పిడి, సహజ వ్యవసాయం, ఎరువుల సమతుల్య వినియోగం వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు.
Minister Tummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్ : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షత, కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించిన వరి విత్తనాల అవసరాలు, సరఫరా ప్రణాళికపై అధికారులు విస్తృతంగా వివరాలు సమర్పించారు. సుమారు 10.80 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు లక్ష్యంగా విత్తనాల ప్రణాళికను రూపొందించినట్లు సమావేశంలో వెల్లడించారు. అవసరమైన విత్తనాల సరఫరా, వ్యయం, అలాగే ప్రత్యామ్నాయ పంట రకాలను ప్రోత్సహించే అంశాలపై కూడా చర్చ జరిగింది.
పంటల మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్)ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరంపై అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రైతులకు స్థిర ఆదాయం కలిగే విధంగా వ్యవసాయ విధానాలను అమలు చేయాలని సమావేశంలో సూచించారు. అదేవిధంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించనున్న రైతు వారోత్సవం కార్యక్రమాలపై కూడా సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2026 మే 4 నుండి మే 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతు వారోత్సవంలో ప్రతి రోజు ప్రత్యేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ విస్తరణ, ప్రత్యామ్నాయ పంటలు, పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్‌పీవోలు, మార్కెటింగ్ అవకాశాలు, సౌరశక్తి వినియోగం, యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, పశుసంవర్ధక, మత్స్య రంగం, నీటి నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, గడుగు గంగాధర్, భవాని మరికంటి, సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, ఏసీపీ సురేంద్ర మోహన్, మెంబర్ సెక్రటరీ గోపాల్, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ స్థిరమైన పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..




