Tummala Nageshwar rao | పంటల మద్ధతు ధర ప్రకటనలకే కేంద్రం పరిమితం : మంత్రి తుమ్మల
Tummala Nageshwar rao | మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి కేంద్రం ఈ సీజన్‌లో నైనా ముందుకు రావాలని , కొనుగోలు చేస్తున్న శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.
Tummala Nageshwar rao | త్రినేత్ర.న్యూస్ : మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి కేంద్రం ఈ సీజన్‌లో నైనా ముందుకు రావాలని , కొనుగోలు చేస్తున్న శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.
రైతుల ఆదాయాన్ని పదేళ్లలో 2024 కల్లా రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మంత్రి తుమ్మల విమర్శించారు. పంటలకు మద్దతు ధర ప్రకటించడం, ప్రతి సంవత్సరం పెంచడం వరకే కేంద్రం పరిమితమైందని, వాస్తవ కొనుగోళ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. మద్ధతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా పంటల కొనుగోళ్లకు రాష్ట్రాలకు మద్ధతు ఇవ్వకపోవడం ఏ రకంగా రైతులు అర్థం చేసుకోవాలి.? రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న మాటలు ఏమయ్యాయో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పండిన పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా, కేంద్ర పరిమితులు విధించడం రైతుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా అధికంగా వరి ఉత్పత్తి అయినప్పటికీ, ధాన్యం సేకరణను ప్రతి సంవత్సరం తగ్గించడం, దొడ్డు బియ్యం సేకరణ విషయంలో మాట మార్చడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. సోయాబీన్, చిక్కుడు, వేరుశనగ, పెసలు, పొద్దుతిరుగుడు వంటి పంటల విషయంలో మొత్తం ఉత్పత్తిలో కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం పరిమితులు విధించడం వల్ల, మిగిలిన పంటను మద్ధతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతోందని తెలిపారు.
తెలంగాణలో విస్తృతంగా పండే మొక్కజొన్న పంట విషయంలో కూడా కేంద్రం కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. మద్ధతు ధర ప్రకటించడమే కాకుండా దానిని ప్రతి సంవత్సరం పెంచుకుంటు పోయిన కేంద్రం ఆ మద్ధతు ధర రైతులకు దక్కుతుందా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదని, వాటి కొనుగోళ్ల కోసం రాష్ట్రానికి ఏ మాత్రం చేయూత ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని స్థితిలో పడుతున్నారని, బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లభించక ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.
కానీ రైతుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కేంద్రం విధించిన పరిమితులకు మించిన పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో పాటు మొక్కజొన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి వివరించారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, దీనివల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న పంట మొత్తాన్ని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం, కనీసం యాసంగి సీజన్‌లో అయినా కేంద్రం కొనుగోళ్లలో అనుమతులు ఇస్తుందని ఆశించినప్పటికీ, ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటికే 200కి పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 1,20,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ఈ రోజు వరకు మద్ధతు ధరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు. మార్కెట్ ధర మద్దతు ధర కంటే రూ.700 తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోళ్లు ఆరంభించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం కొనగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా తగ్గిస్తున్న లెవి అడ్డంకిగా మారుతుందని, పత్తి విషయంలో కొత్త పద్ధతి తీసుకురావాలి అని చూస్తుంది అని, వీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని మంత్రి గుర్తుచేశారు.
మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ ద్వారా కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని, అలాగే శనగ, పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి, పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినప్పటికి, ఎలాంటి స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్ధతు అందించాలని మంత్రి తుమ్మల లేఖ ద్వారా మరోమారు కోరారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



