Tummala Nageshwar Rao | 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తాం : మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభవార్త వినిపించారు. సిద్దిపేటలోని నర్మెట్ట వేదికగా 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి జమ చేస్తారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
22న సిద్దిపేటలో ఆయిల్ పామ్ రిఫైనరీ ప్రారంభం
రూ. 300 కోట్లతో 16 నెలల్లోనే పూర్తి
21 నుంచి 23 వరకు రైతాంగ సదస్సులు
మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాం
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభవార్త వినిపించారు. సిద్దిపేటలోని నర్మెట్ట వేదికగా 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి జమ చేస్తారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సచివాలయం మీడియా హాల్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు.
రేపు రాబోయే పరాభవ నామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆయిల్ పామ్ సంబంధించి పెద్ద కర్మగారం తెలంగాణ నడిగడ్డన సిద్దిపేట నియోజకవర్గం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకుని 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని మంత్రి తెలిపారు.
16 నెలల్లోనే పూర్తి..
తెలంగాణలో రిఫైనరీ లేదు. కేవలం ముడి ఆయిల్ పామ్‌ను పక్క రాష్ట్రాలకు పంపించి రిఫైన్ చేసుకుని, మళ్లీ విజయ బ్రాండ్ ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నాం. హైదరాబాద్‌లో దగ్గరలో ఉండే సిద్దిపేట, తెలంగాణ మొత్తానికి సెంటర్ పాయింట్‌గా ఉంటుంది. అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉంటుంది. 33 జిల్లాల్లో ఆయిల్ పామ్‌లు పెంచుకోవడానికి తెలంగాణ సిద్ధపడింది. వచ్చిన పంటను అశ్వారావుపేటకు తీసుకెళ్తున్నారు. ట్రాన్స్‌పోర్టుకు ఇబ్బంది అవుతుందని చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధప్రతిపాదికన సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేసి.. 16 నెలల్లోనే పూర్తి చేశారు. 22న సీఎం ప్రారంభించనున్నారని మంత్రి తుమ్మల తెలిపారు.
వ్యవసాయ ప్రదర్శన కూడా..
ఈ మహా పండుగకు సంబంధించి పశు సంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసపాయ శాఖ, అందరం కలిసి రైతు ప్రదర్శనను ఏర్పాటు చేశాం. రేపు ఉగాది సందర్భంగా స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభిస్తారు. తర్వాత మూడు రోజులు సాంకేతికత, వ్యవసాయ పనిముట్ల కంపెనీలు, విత్తన కంపెనీలు, యంత్ర పరికరాలు, నూతన వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతాం. రైతాంగానికి రోజు చర్చలు పెట్టి వారి సందేహాలకు శాస్త్రవేత్తల ద్వారా 21 నుంచి 23 వరకు రైతాంగ సదస్సులు నిర్వహిస్తాం. ఈ మూడు రోజులు రైతులు పాల్గొనాలని కోరుతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.
రూ. 9 వేల కోట్లు జమ చేయాలన్ని సీఎం కోరిక
ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు కూడా 22న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం జమ చేస్తారు. రాహుల్ ఇచ్చిన డిక్లరేషన్‌కు అనుగుణంగా రూ. 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి 25 లక్షల మందికి రూ. 21 వేల కోట్లు జమ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, సీఎం ఆలోచనల మేరకు యాసంగికి సంబంధించిన రైతు భరోసాను జమ చేస్తున్నాం. ఖరీప్‌లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేశాం. వచ్చే నెల ఆఖరి నాటికి రూ. 9 వేల కోట్లు జమ చేయాలన్నది సీఎం కోరిక. రైతాంగం సోదరులందరూ రైతు ప్రదర్శనలో పాల్గొనాలని ప్రార్థన. మేం మొక్కజొన్నలను కొనుగోలు చేస్తాం. కానీ కేంద్రం కొనుగోలు చేయడం లేదు. కేంద్రం సహకరించకున్నా మొక్కజొన్నలు ఈ రోజు నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



