Tummala Nageshwar Rao | కేబినెట్ భేటీకి మంత్రి తుమ్మల డుమ్మా..! కారణం అదేనా..?
Tummala Nageshwar Rao | రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరు కాలేదు. మంత్రి తుమ్మల ఎందుకు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదని.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.
ఉదయం సీఎంతో 20 నిమిషాలు భేటీ
అసలేం జరిగింది..?
తీవ్రమైన వెన్నునొప్పి కారణమా..?
రైతు భరోసా నిధులే కారణమా..?
రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..!
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరు కాలేదు. మంత్రి తుమ్మల ఎందుకు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదని.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.
అయితే తీవ్రమైన వెన్ను నొప్పితో కేబినెట్‌కు మంత్రి తుమ్మల హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో నాగేశ్వర్ రావు సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉదయం 10.50 గంటలకు సీఎం నివాసం నుంచి మంత్రి వెళ్లిపోయారు. మంత్రివర్గ సమావేశానికి రావడం లేదని ఉదయమే సీఎంకు చెప్పినట్లు సమాచారం. ఆరోగ్యం కుదుటపడితే కేబినెట్ భేటీలో పాల్గొంటానని సీఎంకు మంత్రి తుమ్మల చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సచివాలయంలో మంత్రి తుమ్మల కోసం దాదాపు 45 నిమిషాల పాటు వేచి చూసినట్లు సమాచారం. ఆయన రావడం లేదని తెలిసిన తరవాతే మంత్రివర్గ సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
రైతు భరోసా నిధులే కారణమా..?
రైతు భరోసా నిధుల విడుదల విషయంలో జాప్యం కొనసాగుతున్నందునే మంత్రి తుమ్మల అలక బూనినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి కొన్ని గంటల ముందు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన తుమ్మల నాగేశ్వర్ రావు.. అంతలోనే డుమ్మా ఎందుకు కొట్టాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలు ముగిసి.. మేయర్లు, చైర్మన్లు కొలువుదీరినప్పటికీ.. రైతు భరోసా నిధులు విడుదల కాలేదు. తాజా పరిస్థితులను చూస్తుంటే.. జడ్పీ ఎన్నికలు అయిపోయాక రైతు భరోసా నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రి తుమ్మల కేబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడంపై రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



