త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | రైతుల ఆశీర్వాదం రేవంత్‌కు ఉండాలి : మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | ఈ రాష్ట్ర రైతాంగం శ్రేయ‌స్సు కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న సీఎం రేవంత్ రెడ్డికి రైత‌న్న‌ల ఆశీర్వాదం ఉండాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు. సాక్షాత్తూ రైతు బిడ్డ అయిన రేవంత్.. రైతును రాజుగా చేసేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ని కొనియాడారు.

S

Telangana | Published On Mar 22, 2026, 4.44 pm IST

Tummala Nageshwar Rao | రైతుల ఆశీర్వాదం రేవంత్‌కు ఉండాలి : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఈ రాష్ట్ర రైతాంగం శ్రేయ‌స్సు కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న సీఎం రేవంత్ రెడ్డికి రైత‌న్న‌ల ఆశీర్వాదం ఉండాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు. సాక్షాత్తూ రైతు బిడ్డ అయిన రేవంత్.. రైతును రాజుగా చేసేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ని కొనియాడారు. సిద్దిపేట జిల్లాలో న‌ర్మెట్ట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రైతుల‌ను ఉద్దేశించి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు మాట్లాడారు.

గ్రామంలో పుట్టి గ్రామంలో చ‌దివి ఈనాడు అసాధ్య‌మైన అంశాల‌ను సుసాధ్యం చేస్తూ రాష్ట్రానికి రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రైతుకు ప్రాధాన్య‌త ఇచ్చారు. రైతాంగ శ్రేయ‌స్సు నా ధ్యేయం. ప్ర‌జా పాల‌న‌లో ప్రాముఖ్య‌త క‌లిగిన అంశం వ్య‌వ‌సాయం. అన్నం పెట్టే రైతాంగానికి ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా మ‌నం వాళ్ల‌కు అండ‌గా ఉండాల్సిందేన‌ని చెప్పి రైతు బిడ్డ‌గా రేవంత్ ప్ర‌తి హామీని నెర‌వేర్చుతున్నారు. 2 ల‌క్ష‌ల లోపు రుణ‌మాఫీ కింద మొద‌టి ఏడాదిలోనే 25 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 21 వేల కోట్ల అప్పులు తీర్చారు మ‌న పెద్ద రైతు. భార‌త‌దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌న‌టువంటి దుస్సాసాహం ఇది. రాష్ట్రం అప్పుల్లో ఉన్న కూడా మాటిచ్చాన‌ని చెప్పి.. ఒకేసారి రుణ‌మాఫీ చేశారు. రైతుల‌ను రుణ విముక్తుల‌ను చేశారు. ప‌ల్లెల గురించి, రైతుల గురించి, నేత‌న్న‌ల గురించి మాట్లాడే సీఎం మ‌న‌కు ద‌క్క‌డం అదృష్టం. రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మొద‌టి రెండేండ్ల‌లోనే రైతుల ఖాతాల్లోకి రూ. ల‌క్షా 4 వేల కోట్లు బ‌ద‌లాయించార‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు తెలిపారు.

ఒకేసారి రూ. 21 వేల కోట్లు రుణ‌మాఫీ

మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్న‌ప్పుడు దేశానికి మొత్తం రూ. 70 వేల కోట్ల రుణ‌మాఫీ చేస్తే. మ‌న సీఎం ఒకేసారి రూ. 21 వేల కోట్లు రుణ‌మాఫీ చేశారు. అయితే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోం. అబ‌ద్దాల‌ను అవాస్త‌వ‌మైన ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌ట్టించుకోం. రైతు క‌ళ్ల‌ల్లో ఆనందం చూసే దాకా వెనుక‌గ‌డు వేయ‌డు అని మ‌న‌వి చేస్తున్నాం. రైతుల‌ను ఆదుకోవాల‌ని చెప్పి రైతు భ‌రోసా కింద రూ. 9 వేల కోట్లను 9 రోజుల్లో రైతుల‌ ఖాతాల్లో జ‌మం చేశాం. పంట‌ల‌కు బోన‌స్ ఇస్తున్నాం. చిరు ధాన్యాల‌కు, ప‌ప్పు ధాన్యాల‌కు బోన‌స్ ఇచ్చి రైతును ఆదుకోవాల‌న్న‌ది సీఎం కోరిక‌. అత్య‌ధికం పంట‌లు పండించిన రాష్ట్రంగా ఉంది. తెలంగాణ న‌డిగ‌డ్డ‌న ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ స్థాపించ‌డానికి కార‌ణం అన్ని జిల్లాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుందని. రిఫైన‌రీలు లేవు. ఇత‌ర రాష్ట్రాల‌కు పంపి మ‌ళ్లీ మ‌నం తీసుకొచ్చి విజ‌య బ్రాండ్‌తో అమ్ముకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మ‌న‌సుతో 50 కోట్ల‌తో ఇక్క‌డే రిఫైన‌రీల‌కు శంకుస్థాప‌న చేశారని మంత్రి తుమ్మ‌ల పేర్కొన్నారు.

ప్ర‌తిప‌క్షాలు గోతికాడ న‌క్క‌లాగా చూస్తున్నారు..

ఈ ముఖ్య‌మంత్రి రుణ‌మాఫీ చేయ‌లేడు. యూరియా ఇవ్వ‌లేడు. భ‌రోసా ఇవ్వ‌లేడు. పంట‌లు కొన‌లేడు అని చెప్పి ప్ర‌తిప‌క్షాలు గోతికాడ న‌క్క‌లాగా చూస్తున్నారు. మీకు అవ‌కాశం రాద‌ని గుంట న‌క్క‌ల‌కు చెబుతున్నాం. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు పంట‌ల‌ను కొనుగోలు చేస్తాం. యూరియా కోసం ప‌ది సార్లు కేంద్రాన్ని క‌లిసిన వ్య‌క్తి సీఎం రేవంత్ రెడ్డి. 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట్నుల‌కు బ‌దులుగా 11.5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా తీసుకొచ్చారు. యూరియా కోసం కొంత‌మంది క్యూలో నిల‌బ‌డితే వారి చెప్పుల‌ను చూసి సంతోష‌ప‌డ్డాయి ప్ర‌తిప‌క్ష పార్టీలు. పోయిన సారి 10 ల‌క్ష‌లు, యాసంగిలో 11 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల యూరియా తీసుకొచ్చామ‌ని మంత్రి తుమ్మ‌ల పేర్కొన్నారు.

మీ జేబుల్లో కోటాది రూపాయాలు జ‌మ చేసే రేవంత్‌ను ఆశీర్వ‌దించాలి..

ఆర్ఎఫ్‌సీ యూరియాను తెలంగాణ‌కు ఇవ్వాల‌ని కోరాం. తెలంగాణ ప‌చ్చ‌బ‌డాలంటే పామాయిల్ పంట‌లు వేయాలి. రైతు అగ్రగామిగా నిల‌బ‌డాలి. మీ జేబుల్లో కోటాది రూపాయాలు జ‌మ చేసే రేవంత్‌ను ఆశీర్వ‌దించాలి. తెలంగాణ‌ను నంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా నిల‌పాలి. అత్య‌ధికంగా పామాయిల్ పంట‌ను సాగ‌ను చేస్తున్నాం. ప్ర‌స్తుతం మూడు ల‌క్ష‌ల ఎక‌రాల్లో పామాయిల్ పంట‌ను సాగు చేస్తున్నాం. మూడేండ్ల‌లో ఆరు ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేస్తామ‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement