Thummala Nageswara Rao | తెలంగాణ రైతు తలెత్తుకునేలా చేస్తాం : మంత్రి తుమ్మల
Thummala Nageswara Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వ్యవసాయం, రైతాంగ సంక్షేమమే ఊపిరిగా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ప్రపంచంలోనే తెలంగాణ రైతు తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకే పెద్దపీట
మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేశాం
రైతు వేదికల ద్వారా రైతులకి అధునాతన టెక్నాలజీ
Thummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వ్యవసాయం, రైతాంగ సంక్షేమమే ఊపిరిగా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ప్రపంచంలోనే తెలంగాణ రైతు తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మెగా మహిళా రైతు మేళాకు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల హాజరై ప్రసంగించారు.

దేశంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత తమ నేత రాహూల్ గాంధీ అలోచనకి అనుగుణంగా సుమారు 25 లక్షల మందికి సుమారు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. గత ప్రభుత్వంలో ఆగిపోయిన రాయితీ విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల్ని పునరుద్ధరించి ప్రారంభిస్తున్నాం. రూ. 500 కోట్లతో పునరుద్దరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకే పెద్దపీట వేస్తున్నాం. భవిష్యత్తులో మహిళలకే డ్రోన్‌లు అందిస్తాం. పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలని విరివిగా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. తమ ప్రభుత్వం రాగానే మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేశాం. రైతు వేదికల ద్వారా రైతులకి అధునాతన టెక్నాలజీలపై అవగాహన కలిపిస్తున్నాం. రైతులు తమ ఉత్పత్తులకి విలువ జోడింపుకి తోడ్పడే టెక్నలాజీలని, యాంత్రీకరణల్ని ప్రోత్సహిస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
ఆహార ధాన్యాలను పండించాలి : మంత్రి శ్రీధర్ బాబు
అధునాతన నైపుణ్యాలు, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలని రైతులు పండించాలి. అలాగే భూసార పరిరక్షణ, పంటల వైవిధ్యకరణలపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మన పైన కూడా ప్రభావం పడుతున్న విషయాన్ని గమనించి ఆహారధాన్యాల విషయంలో స్వావలంబన సాధించాలి. కొత్త వంగడాలు,టెక్నాలజీలని అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకి అసమాన సేవ చేస్తున్నదని శ్రీధర్ బాబు ప్రశంసించారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర : మంత్రి సీతక్క
అందరికీ అత్యంత అవసరమైనది ఆహారమని అది అందరికీ అందుబాటులో ఉండాలంటే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగాలి. ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర అని, 60 నుంచి 80 శాతం మంది మహిళలు వ్యవసాయంలో పనిచేస్తున్నారు. విత్తనాలు నాటిన నుంచి పంట కోసి ఇంటికి చేర్చే దాకా ఆడబిడ్డలు చెమటోడ్చుతారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయినా మహిళల శక్తికి తగ్గ గౌరవం దక్కడం లేదు సీతక్క అభిప్రాయ పడ్డారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



