త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Sridhar Babu | అర్హులైన న్యాయవాదులకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్ : మంత్రి శ్రీధ‌ర్ బాబు

Minister Sridhar Babu | న్యాయవాదుల సంక్షేమం, రక్షణకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అర్హులైన న్యాయ‌వాదుల‌కు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నామ‌ని శ్రీధ‌ర్ బాబు స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 30, 2026, 6.18 pm IST

Minister Sridhar Babu | అర్హులైన న్యాయవాదులకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్ : మంత్రి శ్రీధ‌ర్ బాబు
Advertisement

Minister Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం, రక్షణకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అర్హులైన న్యాయ‌వాదుల‌కు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నామ‌ని శ్రీధ‌ర్ బాబు స్ప‌ష్టం చేశారు.

సామాజిక న్యాయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాం. పీపీలు, స్టాండింగ్ కౌన్సిల్స్, ఇతర లీగల్ నియామకాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్నాం. ఈ విషయంలో కేంద్రం సామాజిక న్యాయం పాటించడం లేదు. లెక్కలు తీస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈ వివక్షతపై సభలోని బీజేపీ సభ్యులు సమాధానం చెబుతారు...? అని మంత్రి నిల‌దీశారు.

రాష్ట్రంలో 414 మంది పీపీలు ఉంటే.. అందులో బీసీలు 126, ఎస్సీ లు 59, ఎస్టీలు 25 మంది ఉన్నారు. ఏపీపీల్లో ఓసీలు 24 మంది, బీసీలు 37 మంది, ఎస్సీలు 16, ఎస్టీలు 3, మైనార్టీ వర్గం నుంచి ఒకరు ఉన్నారు. మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్ అసోసియేషన్ హాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. న్యాయ నిర్మాణ్ ప్రాజెక్ట్ కింద వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలు కృషి చేస్తాం. న్యాయవాదులకు సమగ్ర సంరక్షణకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన సభ్యులకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు అని పేర్కొంటూ శ్రీధ‌ర్ బాబు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement