త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | ‘అడ్డంగా న‌రుకుతాం’.. మ‌క్కాన్ సింగ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మంత్రి శ్రీధ‌ర్ బాబు

Sridhar Babu | 'ఎవ‌డ‌న్న అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా న‌రుకుతాం' అని రామ‌గుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మ‌క్కాన్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి శ్రీధ‌ర్ బాబు స్పందించారు.

S

Telangana | Published On Apr 14, 2026, 3.19 pm IST

Sridhar Babu | ‘అడ్డంగా న‌రుకుతాం’.. మ‌క్కాన్ సింగ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మంత్రి శ్రీధ‌ర్ బాబు
Advertisement

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్ : 'ఎవ‌డ‌న్న అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా న‌రుకుతాం' అని రామ‌గుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మ‌క్కాన్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి శ్రీధ‌ర్ బాబు స్పందించారు. అక్క‌డున్న కొంత మంది కార్య‌క‌ర్త‌ల‌ను చాలా మంది బెదిరిస్తున్నార‌ని చెప్పిన నేప‌థ్యంలో దానికి సంబంధించి రెండు మాట‌లు చెప్ప‌డం జ‌రిగింది. అంతేకానీ రాజ్ ఠాకూర్ ఆలోచ‌నా విధానం శాంతికి భంగం క‌లిగించొద్ద‌నే ఉంటుంది. అనేక సంద‌ర్భాల్లో భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసిన‌ప్పుడు అక్క‌డున్న సోద‌రులు వారి వారి బాధ‌లు చెప్పిన‌ప్పుడు.. జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షులుగా ఆ విధ‌మైన స్పంద‌న క‌నిపించింది అని మ‌క్కాన్ సింగ్ వ్యాఖ్య‌ల‌ను శ్రీధ‌ర్ బాబు స‌మ‌ర్థించారు.

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపాటు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేదికపై మక్కాన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండక పోవచ్చు. రెండు గంటల్లో ఇక్కడ ఉన్న మేం (తనతోపాటు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చింతకుంట విజయరమణారావును చూపిస్తూ) ముగ్గురం ఒక్క క్షణంలో వస్తం. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement