Minister Sridhar Babu | బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ.. మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం
Minister Sridhar Babu | ఈ రాష్ట్రం బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Minister Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : ఈ రాష్ట్రం బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా.. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్‌పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు.
పోలీసు శాఖ, బీసీ వర్గాలు, ఆర్టీసీకి సంబంధించి ప్రతిపక్షం లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం చెప్పారు. పదేండ్ల కాలం పాటు బలహీన వర్గాలను పూర్తిస్థాయిలో అన్యాయం చేశారు. బీసీ సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా.. పదేండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. ఎప్పుడూ లేని విధంగా చట్టానికి సవరణ చేసే విషయంలో, రాహుల్ గాంధీ ఆలోచనలు అమలు చేసే ప్రయత్నంలో ఒకడుగు ముందుకు వేస్తే, పది అడుగులు వారు వెనుకకు గుంజే ప్రయత్నం చేశారు. బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ప్రతి సందర్భంలో అన్యాయం చేశారు. వారికేం నైతిక హక్కు ఉందని వాకౌట్ చేసి పోతున్నారని మంత్రి నిప్పులు చెరిగారు.
ఇన్నోవాలు సమకూర్చడమే పోలీసు సంక్షేమమా..?
పదేండ్లలో పోలీసు సంక్షేమానికి ఏం చేశారు. కేవలం ఇన్నోవాలు సమకూర్చడమే పోలీసు సంక్షేమమా..? పోలీసుల మనోధైర్యం క్షీణించే కార్యక్రమం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఈ శాఖలో పారదర్శకంగా, కరప్షన్ లేకుండా టెక్నాలజీ తీసుకువస్తున్నాం. ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే వాకౌట్ చేస్తారా..? బీఆర్ఎస్‌కు ఏ విషయంలో చిత్తశుద్ధి లేదు. సంక్షేమం, సంస్కరణ విషయంలో చిత్తశుద్ధి లేదు. మాట్లాడానికి ఏం లేదు కాబట్టి.. వాళ్లకున్న ఆప్షన్ వాకౌట్ ఒక్కటే. అర్థం కాని పరిస్థితుల్లోనే వాకౌట్ చేశారు. వాకౌట్ చేస్తే మొత్తం ఈ రోజంతా వాకౌట్ చేయాలి. కేవలం దీని వరకు వాకౌట్ చేసి తిరిగి వస్తామంటున్నారు. బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే సలహాలు ఇవ్వాలి. కానీ వాకౌట్ చేయడం సరికాదు. బీసీలకు సంబంధించి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను మెరుగు పరుస్తున్నాం. కానీ మీరు నీరుగార్చకండి. రాజకీయంగా ఉపయోగించుకోకండి. మా సీఎం, పొన్నం అనేక కార్యక్రమాలను చేస్తున్నారు అని మంత్రి తెలిపారు.
ఇంకా మూడేండ్ల సమయం ఉంది.. మరో ఐదేండ్లు ఉంటాం..
మీరు ఆర్టీసీని నీరుగార్చారు. వారి హయాంలో 56 మంది కార్మికులు చనిపోయారు. సమస్యల కోసం 50 రోజుల పాటు ధర్నా చేస్తే బీఆర్ఎస్ స్పందించలేదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోతున్నాం. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత వాకౌట్ చేయడం సబబా..? ఇంకా మూడేండ్ల సమయం ఉంది. మరో ఐదేండ్లు ఉంటాం.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే, రాహుల్ ప్రధాని అయ్యాక 42 శాతానికి పైగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



