Minister Seethakka | ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
Minister Seethakka | తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
Minister Seethakka | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఆటో, వీల్‌చైర్స్‌తో పాటు పలు సహాయక ఉపకరణాలను అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ టీనేజ్ బాలికల కోసం స్నేహ సమ్మర్ ప్రోగ్రాం లో భాగంగా సైకిల్ రైడింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో బైక్ రైడింగ్ ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు గ్రామ గ్రామాన టీనేజీ బాలికలకు సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్ ను సెర్ప్ ఆధ్వర్యంలో నేర్పిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా సైకిల్ రైడింగ్ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మకు అక్షరమాలలో భాగంగా మహిళలకు విద్యా బోధన, అక్షరాలు చదవడం రాయడం నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మందికి విద్యాబోధన చేస్తున్నామన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



