త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | మ‌హిళా రైతుల‌కు రుణ బీమా, ప్ర‌మాద బీమా : మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | ప్ర‌తి మ‌హిళా రైతు మ‌హిళా సంఘంలో ఉండాల‌ని రాష్ట్ర మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మ‌హిళా రైతుల‌కు వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హకారాన్ని అంద‌జేయ‌డంతో పాటు రుణ బీమా, ప్ర‌మాద బీమాతో మీ జీవితానికి ధీమా క‌ల్పిస్తున్నామ‌ని ఆమె పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 8, 2026, 6.47 pm IST

Minister Seethakka | మ‌హిళా రైతుల‌కు రుణ బీమా, ప్ర‌మాద బీమా : మంత్రి సీత‌క్క‌
Advertisement

ప్ర‌తి మ‌హిళా రైతు.. మ‌హిళా సంఘంలో ఉండాలి
మ‌హిళ‌లంద‌రికీ 30 ర‌కాల టెస్టులు ఉచితం
వారి శ్ర‌మ‌కు త‌గ్గ గౌర‌వం ఇవ్వ‌డం స‌మాజ బాధ్య‌త‌
పేద‌రిక నిర్మూల‌న‌కు సెర్ప్ ప‌ని చేస్తుంది
మ‌హిళ‌ల‌కు రూ. 36 వేల కోట్ల రుణాలు ఇప్పించాం
మెగా రైతు మేళాల‌లో మంత్రి సీత‌క్క వ్యాఖ్య‌లు

Minister Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌తి మ‌హిళా రైతు మ‌హిళా సంఘంలో ఉండాల‌ని రాష్ట్ర మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మ‌హిళా రైతుల‌కు వ్య‌వ‌సాయానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హకారాన్ని అంద‌జేయ‌డంతో పాటు రుణ బీమా, ప్ర‌మాద బీమాతో మీ జీవితానికి ధీమా క‌ల్పిస్తున్నామ‌ని ఆమె పేర్కొన్నారు. విత్తనాలు నాటుడు, నాట్లు వేసుడు, కోతలు కోసుడు విష‌యంలో మహిళలు పురుషుల కంటే ఒక అడుగు ఎక్కువగానే చేస్తారు. వారి శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వడం సమాజం బాధ్యత అని మంత్రి సీత‌క్క తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో మెగా రైతు మేళాకు మంత్రి సీత‌క్క హాజ‌రై ప్ర‌సంగించారు.

మెగా రైతు మేళాలు నిర్వహిస్తున్న జయశంకర్ యూనివర్సిటీకి అభినందనలు. ఇక్కడికి వచ్చి రైతులకు ఉపయోగపడే స్టాళ్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గివ్ టు గైన్ అనే ప్రధాన థీమ్‌తో ఈ ఏడాది మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఐక్య రాజ్య సమితి ఈ ఏడాదిని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది అని మంత్రి సీత‌క్క గుర్తు చేశారు.

మహిళల శక్తికి తగ్గ గౌరవం దక్కడం లేదు

అందరికీ అత్యంత అవసరమైనది ఆహారం. అందరికీ ఆహారం అందాలంటే ఉత్పత్తి పెరగాలి. ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర. 60 నుంచి 80 శాతం మంది మహిళలు వ్యవసాయంలో పని చేస్తున్నారు. విత్తనాలు నాటిన నుంచి పంట కోసి ఇంటికి చేర్చే దాకా ఆడబిడ్డలు చెమటోడ్చుతారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయినా మహిళల శక్తికి తగ్గ గౌరవం దక్కడం లేదు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తోందని సీత‌క్క తెలిపారు.

మహిళలందరికీ 30 రకాల టెస్టులు

మహిళలకు మొదట ఓటు హక్కు కూడా లేదు. పోరాటాల ద్వారా మహిళలు తమ హక్కులు సాధించుకున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళా రైతులకు ఇంకా ఎలాంటి అవకాశాలు దక్కాలి. ఎలాంటి చ‌ట్టాలు రావాలి.. ఇప్ప‌టి వ‌ర‌కు సాధించింది ఏంటి..? ఇంకా సాధించాల్సింది ఏంటి..? అనే విష‌యాల‌పై చ‌ర్చించాల్సిన స‌మ‌యం ఇది. మహిళలందరికీ 30 రకాల టెస్టులను ఉచితంగా చేయిస్తున్నాం. స్టాండ్ విత్ హర్ అంటూ సీఎం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకు బాసటగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని సీత‌క్క గుర్తు చేశారు.

రుణ సదుపాయం కల్పిస్తాం..

ఆడబిడ్డ లేనిది సృష్టి లేదు. అయినా ఆడబిడ్డలకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను రూపుమాపేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదరిక నిర్మూలన కోసం సెర్ప్ పని చేస్తుంది. 65 లక్షల మందిని సంఘ‌టిత ఉద్యమంగా మార్చి ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ రెండేండ్ల‌లో మహిళలకు రూ. 36 వేల కోట్లు రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించాం. వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నాం. మహిళల వ్యాపారాలు చేసేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మహిళలు అని రంగాల్లో రాణిస్తున్నారు. వారి కష్టానికి గుర్తింపుగా వారిని సన్మానించి ఈరోజు రూ. 25000ల ప్రోత్సాహక బహుమానం ఇచ్చామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.

Advertisement
Advertisement